బ్యాటరీ ఆదాకు మరో ఆప్.. | Sakshi
Sakshi News home page

బ్యాటరీ ఆదాకు మరో ఆప్..

Published Tue, Apr 21 2015 11:04 PM

బ్యాటరీ ఆదాకు మరో ఆప్.. - Sakshi

 భలే ఆప్స్

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని పొదుపుగా వాడుకునేందుకు అప్లికేషన్ల జాబితాలోకి డీయూ బ్యాటరీ సేవర్ పేరుతో మరోటి చేరింది. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ల సాయంతో బ్యాక్‌గ్రౌండ్ అప్లికేషన్లను నియంత్రించడంతోపాటు బ్యాటరీ ఛార్జ్ అయ్యే తీరులోనూ మార్పులు తీసుకురావడం ద్వారా దాని జీవితకాలాన్ని పెంచవచ్చునని అంటోంది ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసిన డీయూ స్టూడియో. ఫోన్ వినియోగంలో లేనప్పుడు అతితక్కువ విద్యుత్తు మాత్రమే వాడుకునేలా చేసేందుకు ఇందులో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయని కంపెనీ అంటోంది.

బ్యాటరీ ఎప్పుడు ఎంత ఛార్జ్ అయ్యిందో చూసుకునేందుకు, ఎక్కువ సేపు ఛార్జ్ కాకుండా నియంత్రించేందుకు కూడా దీంట్లో ఏర్పాట్లు ఉన్నాయి. మొత్తమ్మీద తమ అప్లికేషన్‌ను వాడితే బ్యాటరీ టైమ్ దాదాపు 50 శాతం వరకూ ఆదా చేయవచ్చునని కంపెనీ అంటోంది. కొద్దిపాటి రుసుము చెల్లిస్తే లభించే డీయూ ప్రో అప్లికేషన్ ద్వారా 70 శాతం బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు.
 

Advertisement
Advertisement