మగాళ్లకూ గర్భ నిరోధక మాత్రలు! | Sakshi
Sakshi News home page

మగాళ్లకూ గర్భ నిరోధక మాత్రలు!

Published Tue, Mar 20 2018 1:13 AM

Anti-inflammatory pills for males - Sakshi

పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ఇకపై మహిళలు మాత్రమే మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదు. పురుషులపై జరిపిన ప్రయోగాలు విజయవంతం కావడంతో, ఇప్పుడు పురుషులకూ గర్భ నిరోధక మాత్రలు వస్తున్నాయి. మగాళ్లకూ ఇలాంటి సౌకర్యం కల్పించేందుకు ఇప్పటివరకూ బోలెడన్ని ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. చివరకు డైమిథడ్రోలోన్‌ అండీకానోయేట్‌ అనే రసాయనం దీన్ని సాధ్యం చేసింది. దీని సామర్థ్యం, భద్రతపై జరిగిన తొలి పరీక్షలు విజయవంతం కావడంతో మలిదశ ప్రయోగాలకు రంగం సిద్ధమైంది.

చాలామంది పురుషులు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను ఇష్టపడరని.. అవసరమైనప్పుడు మాత్రమే ఇలాంటి సామర్థ్యమున్న పద్ధతి కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన శాస్త్రవేత్త స్టెఫానీ పేజ్‌ తెలిపారు. తొలిదశ ప్రయోగాల్లో తాము వంద మంది పురుషులను ఎంచుకుని మూడు వేర్వేరు మోతాదుల్లో మందు అందించామని, అత్యధిక మోతాదు తీసుకున్న వారిలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి గణనీయంగా మందగించినట్లు గుర్తించామని చెప్పారు. అయితే ఈ మాత్రల వినియోగం వల్ల శరీరంలోని మంచి కొలెస్ట్రాల్‌ కొంత నష్టపోవడంతో పాటు కొద్దిగా ఒళ్లు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసిందన్నారు.  

Advertisement
Advertisement