మీలో సెన్సాఫ్‌ హ్యూమర్‌? | Sakshi
Sakshi News home page

మీలో సెన్సాఫ్‌ హ్యూమర్‌?

Published Sun, Jun 4 2017 11:53 PM

మీలో సెన్సాఫ్‌ హ్యూమర్‌?

సెల్ఫ్‌ చెక్‌

నవరసాల్లో నవ్వురసం స్పెషల్‌. ఇప్పుడు లాఫింగ్‌ క్లబ్బుల గురించి తెలియని వారు చాలా తక్కువే. నవ్వమని డాక్టర్లు కూడా చెప్పడం తెలిసిందే! మీరు నవ్వుతూ పక్కవారిని కూడ నవ్వించగలరా? మీ సెన్సాఫ్‌ హ్యూమర్‌ను ఒకసారి చెక్‌ చేసుకోండి.

1. మీరు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు పెద్దవాళ్లే కాదు, పిల్లలు కూడా మీ చుట్టూ మూగిపోయి మీ మాటలకి గలగలా నవ్వుతారు.
ఎ. అవును     బి. కాదు  

2.  మీ జుట్టు చెదిరిపోయి చికాకుగా అయినప్పుడు ఫంక్షన్‌కు వెళ్లటం మానకుండా వేళ్లతో జుట్టు సరిచేసుకొని ‘ఇదే లేటెస్ట్‌ హెయిర్‌స్టయిల్‌’ అనగలిగిన గడుసుతనం మీ సొంతం.
ఎ. అవును     బి. కాదు

3. మీ ఫ్రెండ్స్‌ మూడీగా ఉన్నప్పుడు మీ దగ్గరకొస్తే చలాకీగా తిరిగి వెళతారు.
ఎ. అవును      బి. కాదు

4. వర్తమానంలో జీవించడమే అసలైన జీవితం అని నమ్ముతారు. గడిచిపోయిన కష్టాలను తలుచుకుంటూ బాధపడరు.
ఎ. అవును     బి. కాదు

5. మీ స్నేహితులు మీతో గడిపిన సమయాన్ని మళ్లీ మళ్లీ సంతోషంగా తలుచుకుంటారు.
ఎ. అవును     బి. కాదు

6.    మిమ్మల్ని చూడగానే మీ పరిచయస్తులు హాయిగా నవ్వేస్తారు.
ఎ. అవును     బి. కాదు

7. మీరు నవ్వాలంటే ప్రత్యేకమైన జోకులూ, హాస్య సన్నివేశాలే అవసరం లేదు. ఎలాంటి సందర్భంలోనైనా నవ్వు పుట్టించగలరు.
 ఎ. అవును     బి. కాదు

8. మీకు జోకులేవీ గుర్తుండవు. ఎవరైనా జోక్‌ చెప్పమంటే తడబడతారు.
ఎ. కాదు     బి. అవును

‘ఎ’ సమాధానాలు 6 పైగా వస్తే మీలో సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ. మీ మాటలతో చుట్టుపక్కల వారిని నవ్వుల్లో ముంచెత్తుతారు. సమయానుగుణంగా జోక్‌లు వేస్తూ మీతోపాటు మీ పక్కవారిని ఆనందింపజేస్తారు. ‘బి’ సమాధానాలు 5 దాటితే మీలో హాస్యరసం తక్కువ. మీరు హాస్యాన్ని ఇష్టపడతారు, నవ్వుతారేమోగానీ, పక్కవారిని నవ్వించడానికి కాస్త కష్టపడాల్సిందే. కొద్దిగా ప్రయత్నించండి... మీరు కూడా హ్యూమర్‌ పండించగలరు.

Advertisement
Advertisement