కీళ్లనొప్పులకు మోకాళ్ల నొప్పులకు... చిన్ముద్ర... అపాన ముద్ర... | Sakshi
Sakshi News home page

కీళ్లనొప్పులకు మోకాళ్ల నొప్పులకు... చిన్ముద్ర... అపాన ముద్ర...

Published Wed, Dec 23 2015 11:51 PM

కీళ్లనొప్పులకు మోకాళ్ల నొప్పులకు... చిన్ముద్ర... అపాన ముద్ర...

యోగ ముద్రల ద్వారా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రమంగా ఆ నొప్పి నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలి? మీరు ఏ వయసు వారైనా కావచ్చు. పద్మాసనంలోకాని, సుఖాసనంలోకాని అదీ వీలు లేకపోతే కుర్చీలో కాని కూర్చోండి.వెన్ను నిటారుగా పెట్టాలి. ఇది తప్పని సరి.ఇప్పుడు రెండు చేతుల చూపుడు వేలును బొటన వేలును సుతారంగా తాకించండి. ఇదే చిన్ముద్ర.

ఈ ముద్రలో ఉన్న చేతులను తొడల మీద ఉంచి సుతారంగా గాలి పీల్చుతూ దీర్ఘ ఉఛ్వాసను దీర్ఘ నిశ్వాసను తీసుకోండి. ఇలా పదిహేను నిమిషాలు చేయండి.ఆ తర్వాత ముద్రను మార్చండి. ఈసారి బొటనవేలికి మధ్య వేలును ఉంగరం వేలును తాకించండి. దీనినే అపాన ముద్ర అంటారు.ఈ ముద్రలో కూడా వెన్ను నిటారుగా పెట్టి దీర్ఘ ఉఛ్వాసను దీర్ఘ నిశ్వాసను తీసుకోండి. ఇలా పదిహేను నిమిషాలు చేయండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే తప్పకుండా మలినాలు తొలగి కీళ్ల నొప్పుల నుంచి మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement