Sakshi News home page

ముఖానికి ఆవిరి ఎంత సేపు?

Published Sat, Nov 26 2016 2:45 PM

ముఖానికి ఆవిరి ఎంత సేపు?

బ్యూటీపార్లర్‌లలో ఫేషియల్‌ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్‌) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి.

► మరీ ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్‌ బాత్‌ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడుతున్నాయో అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోవడానికి ఆవిరి ప్రధాన కారణం అవుతుంది.

► ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలూ ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకే విధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీనివల్ల చర్మంలోని స్వేద రంధ్రాలు తెరుచుకొని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంధులు పొడిబారుతాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం ఉంటుంది.

►  ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల స్వేదరంధ్రాలలో ఉన్న మలినాలు తొలగిపోతాయి.

► పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో తర్వాత ముఖాన్ని తుడుచుకోవాలి. ఆవిరిపట్టిన తర్వాత కొంతమంది చర్మం మరీ పొడిబారినట్టుగా అనిపిస్తుంది. అందుకని ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్‌ వాడాలి.

Advertisement

What’s your opinion

Advertisement