మాడు సమస్యలతో జాగ్రత్త... | Sakshi
Sakshi News home page

మాడు సమస్యలతో జాగ్రత్త...

Published Wed, Dec 13 2017 11:57 PM

Beware of troublesome problems ... - Sakshi

మాడును ఇంగ్లిష్‌లో స్కాల్ప్‌ అని అంటారు. నిజానికి స్కాల్ప్‌ అనేది ఒక పదం కాదు. ‘ఎస్‌’ అంటే స్కిన్, ‘సీ’ అంటే కనెక్టివ్‌ టిష్యూ, ‘ఏ’ అంటే ఎపోన్యూరోటికా, ‘ఎల్‌’ అంటే లూజ్‌ ఏరియోలా, ‘పీ’ అంటే పెరియాస్టియమ్‌ అని అర్థం. ఆయా ఇంగ్లిష్‌ మాటల్లోని మొదటి అక్షరాలను కలిపితే ‘స్కాల్ప్‌’ అనే మాట రూపొందింది. మిగతా చర్మంతో పోలిస్తే... మాడు మీద నూనె స్రవించే గ్రంథుల సంఖ్య దాదాపు పది రెట్లు ఎక్కువ. నూనెను స్రవించే గ్రంథులను సెబేషియస్‌ గ్లాండ్స్‌ అనీ... ఆ నూనెను సీబమ్‌ అని అంటారు.

మనం ఎండలోకి వెళ్లినప్పుడు మన సెబేషియస్‌ గ్లాండ్స్‌ సీబమ్‌ను ఎక్కువగా స్రవించవచ్చు. దాంతో మన జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. నేరుగా మాడుపై ఎండ పడుతూ ఉండటం వల్ల కొందరిలో జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే నేరుగా వెంట్రుకలపై పడే ఎండ వల్ల ‘రోమాంకురాలు’ (హెయిర్‌ ఫాలికిల్స్‌) దెబ్బతింటాయి.  ఫలితంగా వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ సమస్యనే ‘ఎక్టినిక్‌ టెలోజెన్‌ ఎఫ్లువియమ్‌’ అని కూడా అంటారు. అందుకే మనమంతా మాడుకు సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. 

Advertisement
Advertisement