సర్వైకల్ క్యాన్సర్ సర్జరీ తప్పదా!
నా వయసు 30. నాకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది. దీనికి సర్జరీయే మంచిదని అంటున్నారు. ఇది నిజమేనా? నా వైవాహిక జీవితంపై దీని ప్రభావం ఏదైనా పడుతుందా? - ఒక సోదరి, గరుడాపురం
సర్విక్స్ అనే భాగం యోనిని, గర్భసంచితో కలుపుతుంది. ఇది మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అందుకే అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన వల్ల క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. మీకు ఏరకం సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందన్న విషయం చెప్పలేదు. సర్వైకల్ క్యాన్సర్లలో రెండు ప్రధాన రకాలున్నాయి. ఈ రెండింటికి అవలంబించాల్సిన చికిత్స విధానాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ మీకు వచ్చింది ‘అడెనోకార్సినోమా’ తరహాకు చెందినదైతే, ఆపరేషన్ ద్వారా తొలగించగల దశలో ఉంటే, అప్పుడు సర్జరీ ద్వారా ఆ భాగాన్ని తొలగించడమే ఏకైక మార్గం.
ఇక ఇందులో రెండోది ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అనే రకం. ఇది కాస్త ముదిరినప్పటికీ చికిత్స చేసేందుకు చాలా మంచి ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. మీకు శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని చెప్పారంటున్నదాన్ని బట్టి చూస్తే, బహుశా మీ విషయంలో మొదటి లేదా రెండో దశలోనే క్యాన్సర్‌ను కనుగొని ఉండవచ్చు. ఈ దశలో శస్త్రచికిత్స అయినా, రేడియోథెరపీ అయినా రెండూ బాగానే పనిచేస్తాయి. అయితే ఈ రెండింటికీ వాటివాటి ప్రయోజనాలూ, దుష్ర్పభావాలూ రెండూ ఉంటాయి. ఈ రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకొని చికిత్స ప్రక్రియను డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇక మీ విషయంలో మీ వయసు చాలా చిన్నది కావడం, ఇంకా చాలా సెక్స్ జీవితాన్ని అనుభవించాల్సి ఉండటం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటే శస్త్రచికిత్స మేలు. పైగా సర్జరీ తర్వాత వారం లేదా పది రోజుల్లోనే కోలుకోగలరు. సర్జరీతో వచ్చే దుష్ర్పభావాలు అతి స్వల్పం. ఇది ప్రాణాంతకం కాదు. చాలా కొద్దిమందిలోనే సర్జరీ అనంతర కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివారితో పాటు, సర్జరీ అంటే భయపడేవారికి ‘రాడికల్ రేడియోథెరపీ’ అనే చికిత్స చేస్తాం.
అయితే ఈ రేడియోథెరపీ తీసుకున్నవారిలో తర్వాత అడ్హెషన్స్ వంటివి రావడం వల్ల, యోని పొడిబారడం వల్ల సెక్స్ జీవితం సంతృప్తికరంగా ఉండకపోగా, చాలా బాధాకరంగా కూడా ఉండవచ్చు. కాబట్టి మీరు ఆందోళన పడకుండా విజయావకాశాలు 75%నుంచి 90%వరకు ఉండే శస్త్రచికిత్సే చేయించుకోవడం మంచిది. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. సర్వైకల్ క్యాన్సర్ అనేది ‘హ్యూమన్ పాపిలోమా వైరస్’తో వస్తుంది. దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్స ర్ను ముందుగానే నివారించవచ్చు అనే విషయాన్ని మహిళలందరూ తెలుసుకొని 12-20 ఏళ్ల మధ్యలో దాన్ని తీసుకోవడం మంచిది.
డాక్టర్ కె.శ్రీకాంత్
సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్
క్యాన్సర్ కౌన్సెలింగ్
Published Sun, Jul 5 2015 10:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
What’s your opinion
Advertisement