కొవ్వుకణాలతో కేన్సర్‌కు మందులు

20 Jul, 2019 12:35 IST|Sakshi

కేన్సర్‌ కణాలకు చక్కెరపై మక్కువ ఎక్కువని శాస్త్రం చెబుతుంది. చక్కెరను వాడుకోవడం ద్వారా కేన్సర్‌ కణాలు శక్తిని పొందుతాయి. అయితే కొన్ని రకాల కేన్సర్లు కొవ్వుకణాలతోనూ ఇంధనాన్ని సమకూర్చు కుంటాయి. నార్త్‌వెస్ట్‌ర్న్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అంశం ఆధారంగా కేన్సర్‌కు సరికొత్త చికిత్సను సిద్ధం చేశారు. కొవ్వు కణాల్లోపల రహస్యంగా కీమోథెరపీ మందులు దాగి ఉండేలా చేశారు. ఫలితంగా కేన్సర్‌ కణాలు ఈ రకమైన కణాలను ఆహారంగా మార్చుకున్నప్పుడు అందులో ఉన్న మందు నేరుగా కణాలపై దాడి చేస్తుందన్నమాట.

ఈ ప్రత్యేకమైన కొవ్వు కణాల్లో రెండు చేతుల్లాంటి నిర్మాణాలు ఉన్నాయని.. ఒకటి కేన్సర్‌ మందును... ఇంకోటి ప్రొటీన్లకు అతుక్కుంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నాథన్‌ గియాన్‌సెచీ తెలిపారు. కేన్సర్‌ కణితుల్లోని రిసెప్టర్లు ఈ కొవ్వు కణాలను లోనికి రానిస్తాయని.. ఆ తరువాత ఇందులోని కీమో మందు పనిచేయడం మొదలుపెడుతుందని కణితి తాలూకూ కణాలను చంపేస్తుందని నాథన్‌ వివరించారు. చాలా రకాల కేన్సర్లకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాసిలిటాక్సెల్‌ను ప్రత్యేక కొవ్వు కణాల్లోకి చేర్చి జంతువులపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని.. దుష్ప్రభావాలు అతితక్కువగా ఉంటూనే మూడు రకాల కేన్సర్లను ఈ కొత్త కొవ్వుకణాలు సమర్థంగా ఎదుర్కొన్నాయని వివరించారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాధారణ డోస్‌ కంటే 20 రెట్లు ఎక్కువ శక్తిమంతమైన డోస్‌ కేన్సర్‌ కణాలకు అందుతూండటం ఇంకో విశేషం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

సరయు : డాన్స్‌, ఫైట్స్‌, ఆర్ట్స్‌

హాలీవుడ్‌కి రష్యన్‌ పేరడీ!

శిక్ష ‘ఆటో’మాటిక్‌

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!

దోమల నిర్మూలనకు కొత్త మార్గం

హార్ట్‌ ఎటాక్‌ లాంటిదే ఈ ‘లెగ్‌’ అటాక్‌!

మేబీ అది ప్రేమేనేమో!

నో యాక్టింగ్‌ పండూ..

మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే

గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!

పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...

మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...

పుస్తకాంకితురాలు

ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి

అమ్మా.. నువ్వే నా డాక్టర్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్తత!

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?