పచ్చగడ్డే కాదు.. పచ్చిమాంసమూ తింటాయి! | Sakshi
Sakshi News home page

పచ్చగడ్డే కాదు.. పచ్చిమాంసమూ తింటాయి!

Published Sat, Jul 5 2014 10:55 PM

పచ్చగడ్డే కాదు.. పచ్చిమాంసమూ తింటాయి!

జంతు ప్రపంచం

* పుట్టినప్పుడు దాదాపు అన్ని జింకలకీ ఒంటిమీద తెల్లని మచ్చలుంటాయి. కాలం గడిచేకొద్దీ కొన్నింటికి చెరిగిపోతాయి. కొన్నిటి శరీరంపై మిగిలిపోతాయి!
పుట్టిన అరగంటకే ఇవి నడుస్తాయి. నెల తిరిగేసరికే పరుగెత్తుతాయి.
* ఇవి నాలుగు పళ్లతో పుడతాయి. మిగతా పళ్లు తరువాత మొలుస్తాయి!
* జింకలన్నీ శాకాహారులని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని రకాల జింకలు మాంసాన్ని కూడా తింటాయి!
వీటి చెవులు ఎంత బాగా పని చేస్తాయంటే... కొన్ని కిలోమీటర్ల దూరంలో వినిపించే శబ్దాలను కూడా స్పష్టంగా వినగలవు. అంతేకాదు... శబ్దం వచ్చే దిశకు తమ చెవుల్ని తిప్పి మరీ వింటాయి!
* చిన్నగా కనిపిస్తుంటాయి కానీ ఇవి చాలా ఆహారాన్ని తింటాయి. దాదాపు గంట, రెండు గంటల పాటు తింటే కానీ వీటికి కడుపు నిండదు!
* చలికాలం వస్తే ఇవి బద్దకంగా అయిపోతాయి. ఆహారం కూడా చాలా తక్కువగా తీసుకుంటాయి. మళ్లీ వేసవి రాగానే ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది!
* ఏదైనా ప్రమాదం సంభవించబోతోందని అనుమానం వస్తే ఇవి తమ తోకల్ని పెకైత్తుతాయి. దాన్ని చూసిన ఇతర జింకలు పరుగందుకుంటాయి!
* ఇవి కాస్త పిరికివనే చెప్పాలి. చిన్న చిన్న వాటికే బెదిరిపోతుంటాయి. శత్రువు దాడి చేసినప్పుడు మొదట ధైర్యంగా పరుగు తీసినా... ఉండేకొద్దీ బలహీనమైపోతాయి. దాంతో వాటికి చేతికి చిక్కి ఆహారంగా మారిపోతాయి!
* ఇవి ఎప్పుడూ నేరుగా పరుగెత్తవు. వంకర టింకరగా, ముందువెనుకలు చూసుకోకుండా పరుగులు తీస్తాయి. దాంతో ఆ వేగాన్ని నియంత్రించుకోలేక ఒక్కోసారి అడ్డొచ్చినవాటిని గుద్దేస్తుంటాయి. అందుకే కొన్నిసార్లు చనిపోతుంటాయి కూడా!
 

Advertisement
Advertisement