మీకుతెలుసా | Sakshi
Sakshi News home page

మీకుతెలుసా

Published Sun, Apr 1 2018 1:27 AM

Do you know these things  - Sakshi

భార్య గర్భతి అయిన ప్పుడు భర్త సముద్రస్నానం, పర్వతారోహణం, కుమారునికి ఉపనయనం, చావులకు, కర్మకాండలకు వెళ్లడం, నూతులు తవ్వడం, చెట్లు కొట్టడం, ఇల్లు కట్టడం, కొబ్బరికాయ కొట్టడం పనికి రాదు.
సహపంక్తి భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచి వెళ్లడం పాపం.
భార్యాభర్తల మధ్య, ఇద్దరు బ్రాహ్మణుల మధ్య, బ్రాహ్మణునికి, అగ్నికి మధ్య, నందికి, శంకరునికి మధ్య, ఆవు, దూడలకు మధ్యన దాటటం, నడవడం పాపం.
జపం చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు నోటిలో పదార్థాలు నములుతూ క్రతువు చేయరాదు.
 భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం – గంగోత్రి, ఉత్తరాఖండ్‌
నిర్యాణానికి ముందు శ్రీ కృష్ణు్ణడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్‌.
పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి, సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) – కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర సముద్రతీర ప్రాంతం

Advertisement

తప్పక చదవండి

Advertisement