ఉడుతమ్మా కాస్త తినవమ్మా! | Sakshi
Sakshi News home page

ఉడుతమ్మా కాస్త తినవమ్మా!

Published Wed, Dec 17 2014 10:32 PM

ఉడుతమ్మా  కాస్త తినవమ్మా!

నలభై ఆరు సంవత్సరాల గీర్డ్ వెగెన్ ‘చూపు’ తిరిగిన ఫొటోగ్రాఫర్. అలా అని ఆయనేమీ ‘వృత్తి ఫొటోగ్రాఫర్’  కాదు. వడ్రంగం అనేది ఆయన వృత్తి. స్వీడన్‌లో గిర్డ్ నివాసం ఉండే బిస్ప్‌గార్డెన్ గ్రామంలో ఆయన ఇంటి వెనకాల  విశాలమైన పెరడు ఉంది. అది  ఆయన అవుట్‌డోర్ స్టూడియో. ఆ పెరట్లోకి పక్షులను ఆకర్షించడానికి అవసరమైన ఆహారపదార్థాలు ఎప్పుడూ కొలువుదీరి ఉంటాయి. వాటిని చూసి... పక్షులు దగ్గరికి వస్తాయి. అలా వచ్చినప్పుడు వాటిని రకరకాలుగా ఫొటోలు తీస్తాడు గిర్డ్.

ఈసారి  గిర్డ్‌కు ఒక ఉడుతను ఫొటో షూట్  చేసే  అవకాశం వచ్చింది. ‘‘భుజిస్తున్నప్పుడు ఉడుతలు ఎంత ముద్దుగా ఉంటాయో’’ అని ఆయన మురిసిపోతున్నాడు. గిర్డ్ వెగెన్ తీసిన ఫొటో సీరిస్‌ను చూస్తే...ఉడుత కడుపులో కనిపించే ఆకలి, ఆ తరువాత ఆ కళ్లలో కనిపించే సంతృప్తి....మెరుపులు మెరుపులుగా మనల్ని మెప్పిస్తాయి. మచ్చుకు పై ఫొటో చూడండి మరి!
 

Advertisement
Advertisement