వాట్సప్ టిక్కులను వదిలించుకోవడం ఎలా? | Sakshi
Sakshi News home page

వాట్సప్ టిక్కులను వదిలించుకోవడం ఎలా?

Published Wed, Nov 19 2014 12:29 AM

వాట్సప్ టిక్కులను వదిలించుకోవడం ఎలా? - Sakshi

మీరు వాట్సప్ మెసెంజర్‌లో ఉన్నారా? అయితే వారం రోజులుగా మీరు పంపిన మెసేజీలను ఒకసారి చూడండి. వాటిపక్కనే నీలిరంగు టిక్కులు ఒకట్రెండు కనపడుతున్నాయా? అవేమిటో, ఎందుకో అర్థం కావడం లేదా? వాటినెలా తొలగించుకోవాలో తెలియడం లేదా? ఏం ఫర్వాలేదు. ఇంకో ఐదు నిమిషాల్లో అన్నీ అర్థమైపోతాయి. విషయమేమిటంటే... కొన్ని రోజుల క్రితం వాట్సప్ ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మెసేజీ పంపగానే ఒక టిక్, అవతలి వ్యక్తి ఆ మెసేజీని చూడగానే ఇంకో టిక్ పడేలా ఏర్పాట్లు చేసింది.

మనం పంపే మెసేజీలు అవతలివారు చూశారా... లేదా? అన్నది చెక్ చేసుకునేందుకు... బాగానే ఉంటుంది ఈ ఫీచర్. కాకపోతే ఇది కొంతమందికి నచ్చింది.. ఇంకొంతమందికి నచ్చలేదు. తను పంపిన మెసేజీలు చూడటం లేదని సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడట. ఈ నేపథ్యంలో ఈ టిక్‌లను తొలగించుకోవడమెలా అన్న ప్రశ్న వచ్చింది. చాలా సింపుల్. కింద చూపినట్లు చేస్తే సరి...
1.    అన్నింటి కంటే ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘డౌన్‌లోడ్ ఫ్రం అన్‌నోన్ సోర్సెస్’ అన్న ఆప్షన్‌ను డిజేబుల్ చేయాలి.
 2.    వాట్సప్ వెబ్‌సైట్‌కు వెళ్లి తాజా ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. బదులుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సప్‌ను తాజాగా కొత్త వెర్షన్‌తో ఇన్‌స్టాల్ చేసుకున్నా సరిపోతుంది.
 3.    తాజాగా వాట్సప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత నేరుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
 4.    అకౌంట్ ట్యాబ్‌లోకి వెళ్లి ప్రైవసీపై క్లిక్ చేయండి.
 5.    ఇక్కడ మీరు ‘రీడ్ రెసీప్ట్స్’ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని డిసేబుల్ చేస్తే... ఆ తరువాత నుంచి మీకు నీలిరంగు టిక్‌లు కనిపించకుండా పోతాయి.

Advertisement
Advertisement