గోల్డ్‌క్రీమ్ | Sakshi
Sakshi News home page

గోల్డ్‌క్రీమ్

Published Wed, Jan 20 2016 11:47 PM

గోల్డ్‌క్రీమ్ - Sakshi

తిక్క లెక్క

ఫొటోలో కనిపిస్తున్నది అలాంటిలాంటి హిమక్రీము కాదు, మేలిమి బంగారంతో చేసిన గోల్డ్‌క్రీము. అచ్చంగా 23 కేరట్ల బంగారు రేకును పైపూతగా అలంకరించిన ఈ హిమక్రీము ధర ఎంతో కాదు, వెయ్యి డాలర్లు (సుమారు రూ.68 వేలు) మాత్రమే. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐస్‌క్రీముగా ఇది గిన్నెస్ రికార్డును సొంతం చేసుకుంది.

న్యూయార్క్‌లోని కేట్ బెకిన్‌స్లేట్ అండ్ జాన్ కసాక్ రెస్టారెంట్‌లోని పాకశాస్త్ర నిపుణులు దీనిని అపురూపంగా తయారు చేశారు. దీనిని తినాలంటే రెండు రోజుల ముందు ఆర్డర్ ఇవ్వాల్సిందే.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement