పెట్ ఉంటే పదేళ్లు యంగ్..! | Sakshi
Sakshi News home page

పెట్ ఉంటే పదేళ్లు యంగ్..!

Published Tue, Aug 12 2014 11:51 PM

పెట్ ఉంటే  పదేళ్లు యంగ్..!

 గృహిణులు, ిసీనియర్ సిటిజన్ల జీవితాల్లో పెంపుడు జంతువులు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయంటున్నారు అధ్యయనకర్తలు. ఒక పెట్‌ను పెంచుకోవడం నిస్తేజాన్ని పోగొడుతుందని అంటున్నారు. బ్రిటన్‌కు చెందిన ఒక యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం శునకాన్ని లేదా పిల్లిని పెంచుకొనేవారు ఇతరుల కన్నా 12 శాతం ఉత్సాహంగా ఉంటారని తేలిందట.

దాని పోషణపైన, లాలించడం మీద దృష్టిపెట్టడం, దానితో మానసికంగా బంధాన్ని ఏర్పరుచుకోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు. పెట్‌ను పెంచుకొనే వారిలో తమకన్నా పదేళ్లు తక్కువ వయసువారిలో ఉండే ఉత్సాహం ఉంటుందని వర్సిటీ అధ్యయనకర్తలు అభ్రిపాయపడ్డారు. ఇళ్లకు పరిమితమై జీవితాలు యాంత్రికంగా మారాయనే వారు తక్షణం ఒక పెట్ పోషణపై దృష్టి పెట్టాలని వారు సూచించారు.
 

Advertisement
Advertisement