ఈ వారం యూట్యూబ్ హిట్స్ | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్

Published Sun, Nov 15 2015 10:37 PM

ఈ వారం యూట్యూబ్ హిట్స్

దిల్‌వాలే : ట్రైలర్
నిడివి : 3 ని. 17 సె.
 హిట్స్ : 1,11,24,281

డెరైక్షన్ రోహిత్ శెట్టి. ప్రొడ్యూసర్ గౌరీఖాన్. స్టారింగ్.. కాజోల్, షారుక్ ఖాన్, వరుణ్ ధావన్, కృతిసనన్! వీళ్లంతా సరే, అసలు కిక్కు టైటిల్‌లో ఉంది. ‘దిల్‌వాలే’! డిసెంబర్ 18న విడుదలౌతున్న ఈ చిత్రం ట్రైలర్‌కి టైటిల్ వాల్యూనే సగం హిట్స్ సంపాదించిపెట్టింది. ఇక షారుక్, కాజోల్‌ల ఎంట్రీ మైండ్ బ్లోయింగ్! ఇరవై ఏళ్ల క్రితం ‘దిల్‌వాలా దుల్హనియా లే జాయేంగే’ లోని ఈ జంట అప్పుడెలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే... అంతకంటే ఎట్రాక్టివ్‌గా ఉన్నారు. ఈ రొమాంటిక్ యాక్షన్ కామెడీని చూడ్డం కోసం రెండు తరాల ప్రేక్షకులు ఈగర్‌లీ వెయిటింగ్!
 
 మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 2 : ట్రైలర్
 నిడివి : 2 ని. 30 సె.
 హిట్స్ : 34,43,406

 కిర్క్‌జోన్స్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ మూవీ ‘మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 2’ ట్రైలర్ ఇది. పిక్చర్ ఎంత రొమాంటిక్ కామెడీనో ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. 2002లో విడుదలైన ‘మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్’కు సీక్వెల్ అయిన ఈ ... వెడ్డింగ్-2 వచ్చే ఏడాది మార్చి 25న విడుదలౌతోంది. ఒక గ్రీకు అమెరికన్ యువతి ఒక ఎగువ మధ్యతరగతి నాన్-గ్రీకు యువకుడితో ప్రేమలో పడడం, ఆ తర్వాత ఇద్దరూ పాట్లు పడడం పార్ట్ 1 ప్రధాన కథాంశం. దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 ఉండబోతోంది. అదే కామెడీ, అదే రొమాన్స్. ఇంచుమించు అదే తారాగణం.
 
యూ ట్యూబ్ మ్యూజిక్
 
నిడివి : 1 ని. 33 సె.
 హిట్స్ : 22,09,262

 యూట్యూబ్ అధికారికంగా విడుదల చేసిన ఈ మ్యూజిక్ యాప్ పబ్లిసిటీ వీడియో ఎంతో ఉత్తేజకరంగా ఉంది. ప్రస్తుతం యు.ఎస్.లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యూట్యూబ్ మ్యూజిక్ యాప్.. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పని చేస్తుంది. ఇష్టమైన సాంగ్స్‌ని కేటగిరీల వారిగా (ఆర్టిస్ట్, ఆల్బమ్, జానర్) చూసేందుకు వీలుగా ఇది రూపొందింది. ఇలాంటి మ్యూజిక్ సర్వీస్‌నే గూగుల్ ఈ ఏడాది మొదట్లో యాడ్స్‌ని తొలగించి ‘యూట్యూబ్ మ్యూజిక్ కీ’ పేరుతో విడుదల చేసింది. దానికి అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఈ యూట్యూబ్ మ్యూజిక్.
 
మిస్సీ ఇల్లియట్ - డబ్ల్యు.టి.ఎఫ్.
నిడివి : 3 ని. 44 సె.
హిట్స్ : 78,77,440

 డ బ్ల్యు.టి.ఎఫ్. అంటే ‘వేర్ దే ఫ్రమ్’. 44 ఏళ్ల అమెరికన్ ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్, రికార్డ్ ప్రొడ్యూజర్ అయిన మెలిస్సా ఆర్నెట్ ఇల్లియట్ (మిస్సీ ఇల్లియట్) లేటెస్ట్‌గా చిత్రీకరించిన వీడియో సాంగ్.. వేర్ దే ఫ్రమ్. నాలుగు రోజుల క్రితమే అట్లాంటిక్ రికార్డ్స్ సంస్ధ దీనిని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసింది. చేసీ చేయగానే ఈ సాంగ్‌కి హిట్‌లే హిట్లు. దీర్ఘకాలం తర్వాత విడుదలైన మిస్సీ ‘బ్లాక్ పార్టీ’ అల్బమ్‌లోని ఈ సింగిల్ లీడ్ సాంగ్ రోజురోజుకీ అమితమైన ఆదరణ పొందుతోంది. విశ్వవిఖ్యాత విమర్శకులంతా ఏకధాటిగా డబ్ల్యు.టి. ఎఫ్. ను ప్రశంసిస్తున్నారు.
 

జస్టిన్ బీబర్ : న్యూడ్ పాప్పరాజీ
 నిడివి : 3 ని. 34 సె.
 హిట్స్ : 18,65,880

కెనెడియన్ సింగర్ జస్టిన్ బీబర్  ‘ఎల్లెన్ షో’కి వచ్చి, సిగ్గుతో ఎరుపెక్కిన తన ముఖాన్ని రెండు చేతులతో దాచుకున్న క్లిప్పింగ్ ఇది. కారణం... దక్షిణ పసిఫిక్ ద్వీపమైన బోరాబోరాలో ఈ కుర్రాడు దిగంబరంగా విహరిస్తున్నప్పుడు ఒక పాప్పరాజీ తీసిన ఫొటోలను నిండు షోలో పెద్ద స్క్రీన్‌పై వ్యాఖ్యాత ఎల్లెన్ ప్రదర్శించడమే. ఇందులో సిగ్గుపడవలసింది ఏమీ లేదు అని చెప్పడానికా అన్నట్లు.. బికినీ ధరించిన ఒక యువతికి ఎల్లెన్ తలను అమర్చిన క్లిప్లింగ్‌ను కూడా స్క్రీన్‌పై ప్రదర్శించారు. మిస్ ఎల్లెన్ అమెరికన్ కమెడియన్, టీవీ హోస్ట్. ఎల్లెన్ టాక్ షో బాగా పాపులర్.

Advertisement

తప్పక చదవండి

Advertisement