ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ | Sakshi
Sakshi News home page

ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్

Published Sun, Jan 19 2014 3:16 AM

ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ - Sakshi

 మీరు స్కూల్‌కి సైకిల్‌పై వెళుతున్నారా? లేక సాయంత్రం ఇంటికి వచ్చాక ఇంటి చుట్టూ సైకిల్‌తో చక్కర్లు కొడుతున్నారా? ఏదైనా కానివ్వండి... సైకిల్ నడపడం అనేది ఆరోగ్యానికి ఎంత మంచిదో, పర్యావరణపరంగా కూడా అంతే మంచిది. సైకిల్ కాలుష్య రహితమైనది. పైగా దీన్ని ఉపయోగించడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న సైకిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

  1860వ సంవత్సరంలో ఫ్రాన్స్‌లో యాంత్రికంగా నడిచే ద్విచక్ర సైకిల్‌ను మొట్టమొదటిసారి ఆవిష్కరించారు.
  ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద దాదాపు వందకోట్ల సైకిళ్లను ఉపయోగిస్తున్నారు. ఇది మిగిలిన ద్విచక్రవాహనాల కంటే రెండు వంతులు ఎక్కువ.

  ఒక కారు తయారీ ఖర్చుతో ‘100’ సైకిళ్ళను తయారుచేయవచ్చు.
  1935 సంవత్సరంలో ఫ్రెడ్ ఎ. బిర్చ్‌మోర్... యూరప్, ఆసియా, యునెటైడ్ స్టేట్స్‌లో 25,000 మైళ్ళు సైకిల్‌పై ప్రయాణించారు.

  న్యూజెర్సీ, ఓహియోలోని సెయింట్ హెలెన్స్ పాఠశాలలో సైకిలింగ్ అనేది తప్పనిసరి సబ్జెక్ట్. ఈ పాఠశాలలో విద్యార్థులు తరగతులకు, హాల్‌కు మధ్య వున్న స్థలంలో సైకిళ్ళను నడుపుతుంటారు.
  ప్రపంచంలోనే అత్యంత పెద్ద సైకిల్ 67 అడుగుల పొడవు కలిగివుంది. దానికి 35 సీట్లు ఉంటాయి.


  రోజూ సైకిల్ నడిపేవారు ఉన్న వయసు కంటే పది సంవత్సరాలు యవ్వనంగా కనిపిస్తారని వైద్యులు తేల్చారు. అదేవిధంగా సైకిల్ తొక్కడం వల్ల 50 శాతం వరకు గుండె వ్యాధుల బారి నుండి తప్పించుకునే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement