స్టాక్‌మార్కెట్‌లో మదుపు చేయాలనుంటే..? | Sakshi
Sakshi News home page

స్టాక్‌మార్కెట్‌లో మదుపు చేయాలనుంటే..?

Published Tue, Feb 10 2015 10:56 PM

స్టాక్‌మార్కెట్‌లో  మదుపు  చేయాలనుంటే..?

నేను, మా వారు ఇద్దరం ఉద్యోగస్థులమే. మాకు 2, 3 తరగతులు చదివే పిల్లలున్నారు. మేము నెలవారీగా కానీ, మూడునెలలకోసారి గానీ స్టాక్‌మార్కెట్‌లో కొంత మొత్తం పెట్టుబడి పెడదామనుకుంటున్నాము. అయితే మాకు షేర్లను కొంటారు, అమ్ముతారు అని తెలుసు కానీ, స్టాక్‌మార్కెట్ గురించి బొత్తిగా తెలియదు. ట్రేడింగ్ ఎలా చేయాలో, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తగిన సలహా ఇవ్వగలరు.
 - సురేఖ, హైదరాబాద్
 
సురేఖా! షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి రెండు జాతీయ స్థాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, కంపెనీలున్నాయి. అవి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఈ). వీటి ద్వారా షేర్ల కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. ఈ ఎక్స్ఛేంజీలలో లావాదేవీలు నిర్వహించాలనుకునే వారికి, స్టాక్ ఎక్స్ఛేంజీలకు మధ్యవర్తిత్వం నెరిపేందుకు గుర్తింపు పొందిన (రిజిస్టర్డ్) స్టాక్‌బ్రోకర్లుంటారు.+

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే ముందు మీరు గుర్తింపు పొందిన స్టాక్ బ్రోకర్ వద్ద బ్రోకింగ్ ఎకౌంట్ ఓపెన్ చేయాలి. అలాగే ఏదైనా రిజిస్టర్డ్ డీపీ (డిపోజిటరీ పార్టిసిపెంట్) వద్ద డీ మ్యాట్ ఎకౌంట్ కలిగి ఉండాలి. మీరు డబ్బు దాచుకునే బ్యాంక్ తాలూకు ఆన్‌లైన్ ఎకౌంట్ కూడా ఉండాలి. మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను సింగిల్ షేర్‌తో కూడా ఆరంభించవచ్చు. నెలవారీగా నిర్దిష్టమొత్తంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)తో మంచి గ్రోత్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయవచ్చు. కొద్దిమొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి ప్లాన్. ఇదే సందర్భంలో మీరు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మదుపు చేసేముందు ఈ కింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. షేర్ల కొనుగోలు, అమ్మకాల వ్యవహారంలో నగదు లావాదేవీలు నిర్వహించవచ్దు. ఆమోదించవద్దు. సంబంధిత రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ పేరిట చెక్కును మాత్రమే జారీ చేయండి లేదా మీ పేరుతో ఇచ్చే చెక్కులను మాత్రమే ఆమోదించండి.

డీమ్యాట్ అకౌంట్‌లో నామినీ పేరును తప్పనిసరిగా నమోదు చేయించండి.
లో బీటా స్టాక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి.
బ్లాంక్ డీ మ్యాట్ ఇన్‌స్ట్రక్షన్స్ కానీ బ్లాంక్ చెక్కులు కానీ జారీ చేయకూడదు.
మీ ఇంటర్నెట్ ట్రేడింగ్ పాస్‌వర్డ్‌ను ఎవరికీ చెప్పవద్దు.
{sేడింగ్ కోసమని అప్పు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టవద్దు.
సింగిల్ స్టాక్‌లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయవద్దు.
 - రజని భీమవరపు, సీఎఫ్‌పీ, జెన్‌మనీ
 
 

Advertisement
Advertisement