జాకెట్స్... జిగ్‌జాగ్... | Sakshi
Sakshi News home page

జాకెట్స్... జిగ్‌జాగ్...

Published Thu, Oct 15 2015 11:37 PM

జాకెట్స్... జిగ్‌జాగ్...

మార్కెట్‌లో వీటికి సంబంధించిన ఎంతో రా మెటీరియల్ అందుబాటులో ఉంది. వీటిని కొద్ది మార్పులతో మీ శరీరాకృతికి నప్పే విధంగా కుట్టుకోవచ్చు.  కత్తెర, ఫ్యాబ్రిక్ గ్లూ, అద్దాలు, ప్యాచ్‌లు దగ్గర ఉంచుకుంటే ఎంచుకున్న జాకెట్‌ను మీకు తగినవిధంగా మీరే డిజైన్ చేసుకోవచ్చు.  గ్లూతో అతుకుపెట్టదగిన ప్లాస్టిక్ అద్దాలను ఎంచుకుంటే ప్రత్యేకమైన మెజర్‌మెంట్స్ కూడా అవసరం లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు పేస్ట్ చేసుకోవచ్చు.

జాకెట్ స్ట్రిప్‌కి బాటమ్ కలర్ స్ట్రిప్ అంచుగా జతచేసి, దాని మీద వరుసగా మిర్రర్స్‌ను అతికించినా సరిపోతుంది.  రకరకాల పూసలతో డిజైన్ చేసిన ప్యాచ్‌వర్క్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. జాకెట్‌ను మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవడానికి ఇవన్నీ సాయపడతాయి.  ఇదే విధంగా లెహంగా, చోళీలను మీరే స్వయంగా డిజైన్ చేసుకోవచ్చు.
 
 

Advertisement
Advertisement