వేళ్లు జాగ్రత్త.. లేకుంటే జైలు ఖాయం! | Sakshi
Sakshi News home page

వేళ్లు జాగ్రత్త..

Published Sat, Jun 9 2018 12:04 AM

Jail on Speedy messages for women from smartphones - Sakshi

స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక ఎవరి ఒళ్లు వారి దగ్గరే ఉంటోంది. అయితే ఇకనుంచీ ఒళ్లు మాత్రమే దగ్గరుంటే సరిపోదు. ఫోన్‌ని కూడా హద్దులు దాటకుండా చూసుకోవాలి. ఈ వర్షాకాల సమావేశాల్లో 1986 నాటి ‘ఇండీసెంట్‌ రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ యాక్ట్‌’కి సవరణలు తేవాలని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించబోతోంది. సవరణ బిల్లు ఆమోదం పొంది, అది అమలు అవడం ప్రారంభించిన క్షణం నుంచీ.. ఎవరైనా తమ స్మార్ట్‌ఫోన్‌లలోంచి స్త్రీలకు అసభ్యకరమైన సందేశాలు పంపినా, మహిళల శీల ప్రతిష్టకు భంగకరంగా పోస్టింగులు పెట్టినా.. సరాసరి జైలుకే! ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం రచనల్లోగానీ, వ్యాపార ప్రకటనల్లో గానీ, పెయింటింగులలో గానీ, కరపత్రాలలో గానీ, ఆఖరికి హోర్డింగులలో గానీ మహిళలను కించపరిచేలా, వాళ్లను అవమానించేలా, అసభ్యంగా, అశ్లీలంగా చిత్రీకరిస్తే అది నేరం అవుతుంది.

రాబోయే పార్లమెంటు సమావేశాల్లో డిజిటల్‌ మీడియాను కూడా ఈ చట్టం పరిధిలోకి తెచ్చే ప్రతిపాదన ఆమోదం పొందితే కనుక అన్నివిధాలైన ఆన్‌లైన్, డిజిటల్, ఎలక్ట్రానిక్‌ సర్వీసులకు ఇది వర్తిస్తుంది. 
చట్ట సవరణలో భాగంగా జాతీయ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో ఫిర్యాదులను స్వీకరించి, విచారణ జరిపే ఒక సంస్థను నెలకొల్పాలని కూడా కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తీర్మానించింది. విచారణ సంస్థలో అడ్వరై్టజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సమాచార–ప్రసారశాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సారాంశం ఏంటంటే.. టెక్సి›్టంగ్‌లు, పోస్టింగ్‌లు చేసే వేళ్లను అదుపులో పెట్టుకోవాలని... లేకుంటే జైలు ఖాయం అని! 

Advertisement
Advertisement