సూపర్ హీరో! సమ్‌థింగ్ స్పెషల్ | Sakshi
Sakshi News home page

సూపర్ హీరో! సమ్‌థింగ్ స్పెషల్

Published Sun, Apr 26 2015 11:17 PM

సూపర్ హీరో!  సమ్‌థింగ్ స్పెషల్

జపాన్‌లోని షింజిరో  కిటాకెయూష్ పట్టణంలో కుమాగై తన బైక్ మీద వీధి వీధి తిరుగుతాడు. ఏంపని లేదా ఏమిటి? అంటే చాలా పనే ఉంది. అదేమిటంటే, వీధి వీధి తిరుగుతూ... ఎవరైనా తాగి డ్రైవింగ్ చేస్తుంటే అడ్డుకుం టాడు. వారిని పోలీసులకు అప్పచెబుతాడు. జపాన్ సూపర్‌హీరో ‘కమెన్ రైడర్’లా ఆహార్యం ధరించి తన బైక్ మీద వీధుల్లో తిరుగుతుంటే...తాగుబోతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి.

మరి రోజూ వీధుల్లో తిరగడమంటే మాటలు కాదు కదా... ఖర్చు తో కూడుకున్న వ్యవహారం! అయితే ఈ ఖర్చులకు అవసరమైన డబ్బును ఫుకుమి సు అనే బుద్దిస్ట్ అందిస్తున్నాడు. ఆయనకు సూపర్‌హీరో కమెన్ రైడర్ అంటే ప్రాణం. షింజిరో పుణ్యమా అని తాగి డ్రైవింగ్ చేసే వాళ్ల సంఖ్య బాగా తగ్గింది.

Advertisement
Advertisement