పిటిషన్‌ టెన్షన్‌ | Sakshi
Sakshi News home page

పిటిషన్‌ టెన్షన్‌

Published Tue, Dec 5 2017 11:53 PM

Kangana Ranaut refuses to sign Shabana Azmi's letter  - Sakshi

షబానా అజ్మీ ఒక పిటిషన్‌ తయారు చేసింది. దీపికా పదుకోన్‌పై ‘పద్మావతి’ సినిమా గురించి వచ్చిన బెదిరింపులకు వ్యతిరేకంగా ‘దీపికా బచావ్‌’ అన్న పిటిషన్‌ ఇది. బాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్‌లందరూ.. అనుష్కా, విద్యాబాలన్, కత్రినా కైఫ్‌ లాంటి వాళ్లు సహా.. ఈ పిటిషన్‌ని సమర్థిస్తూ సంతకాలు పెట్టారు. కానీ కత్తిలా మాట్లాడే కంగనా రనౌత్‌ మాత్రం పిటిషన్‌పై సంతకం పెట్టలేదు. అంటే కంగనాకి దీపిక అంటే కోపమా? దీపికకు జరిగిన అన్యాయం అన్యాయంగా అనిపించడం లేదా? దీని వెనకాల వేరే ఏదైనా శత్రుత్వం ఉందా.. అని కనుక్కోవడానికి కంగనా బెస్ట్‌ ఫ్రెండ్‌ అనుష్కా శర్మ ఫోన్‌ చేసి కంగనాను అడిగిందట! క్యా బాత్‌ హై? వై యు ఆర్‌ నాట్‌ సైనింగ్‌? నువ్వెందుకు సపోర్ట్‌ చెయ్యడం లేదు? అనడిగితే... ‘‘పిటిషన్‌ తయారు చేసింది షబానా అజ్మీ కదా!

గతంలో ఒకసారి మగాళ్లంతా నా మీద విరుచుకు పడుతున్నప్పుడు అజ్మీ ఏం చేసిందీ? నా క్యారెక్టర్‌ కరెక్ట్‌ కాదని చెప్పింది. అలాంటి షబానా అజ్మీ రాసిన పిటిషన్‌ మీద నేనెలా సంతకం పెట్టాలి? అదీ కాకుండా ఈ దేశంలోని రాజకీయ వ్యవస్థల్లో లెఫ్ట్‌కీ, రైట్‌కి మధ్య బలమైన గీత గీసింది అజ్మీ. ఒక సైడ్‌ తీసుకుంది అజ్మీ. అవన్నీ ఆవిడ రాజకీయాలు. అలాంటి ఆవిడ తయారుచేసిన పిటిషన్‌ మీద నేను సంతకం పెట్టడం ఏంటి? నేను ఎవర్ని సపోర్ట్‌ చేయాలన్నా, ఎవరి కోసం పోరాడాలన్నా, అది నా ఆలోచన అయి ఉండాలి. నా ఆలోచనతో కలవని వారి ఆలోచన ను నేనెలా సమర్థించగలను? మై సపోర్ట్‌ ఈజ్‌ ఆల్వేస్‌ దేర్‌ ఫర్‌ దీపిక’’ అంటూ అనుష్కా శర్మకి ముద్దుగా చెప్పిందట కంగనా. 

Advertisement
Advertisement