పోటీపడుతున్నారా? | Sakshi
Sakshi News home page

పోటీపడుతున్నారా?

Published Wed, Nov 20 2013 11:54 PM

పోటీపడుతున్నారా? - Sakshi

ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటిషన్‌లో తమ చిన్నారులు పాల్గొనాల ని, బహుమతులు గెలుచుకోవాలని తల్లులు తపనపడుతుంటారు. పిల్లలు ఉత్సాహంగా పాల్గొనే ఈ షోలో పేరెంట్స్  చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
     
 ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటిషన్ అంటేనే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే డ్రెస్ డిజైనింగ్‌లో కాంతివంతమైన రంగులను ఎంచుకోవాలి.
     
 ఫ్యాన్సీ డ్రెస్ కాస్ట్యూమ్స్ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటున్నాయి. స్కూల్ టీచర్, డిజైనర్ సలహాలతో, టైలర్‌కి చెప్పి డిజైన్ చేయించుకోవచ్చు.
     
 ఎలాంటి డ్రెస్ ఎంచుకున్నా, వేదిక మీద క్యారెక్టర్‌కు తగ్గ లుక్ ఆహూతులను ఆకట్టుకునేలా వేషధారణ ఉండాలి.
     
 కాంపిటిషన్ సమయంలో చాలామంది పిల్లలు సీతాకోకచిలుకల్లా అందమైన డ్రెస్సులు ధరించి కనువిందు చేస్తుంటారు. ఈ సమయంలో న్యాయనిర్ణేతల దృష్టి హ్యాండ్ క్రాఫ్డ్ డ్రెస్‌ల మీదే అధికం గా ఉంటుంది. సొంతంగా డిజైన్ చేసిన డ్రెస్‌కు మరో డ్రెస్ ఎప్పుడూ పోటీ కాదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని డ్రెస్‌ను డిజైన్ చేసుకోవాలి.
     
 పోటీలో చురుగ్గా పిల్లలు పాల్గొన్న విధానమూ పేరక్షకులను, న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంటుంది. అందుకని వారి లేత చర్మానికి హాని కలిగించని క్లాత్, డిజైన్స్ మాత్రమే డ్రెస్సులకు ఎంచుకోవాలి.
     
 పాత్రకు తగిన విధంగా కొన్ని పెయింటింగ్ డిజైన్స్, ఎంబ్రాయిడరీ, చమ్కీ.. వంటివి డ్రెస్సుల మీద ఉపయోగిస్తుంటారు. వీటితో పాటు అలంకరణలో వాడే రంగులు, లేసులు, ఐరన్ పిన్స్ ... వంటివి శరీరానికి గుచ్చుకునేలా ఉంటే పిల్లలు చిరాకుపడతారు.
     
 ఏ డ్రెస్‌కైనా లోపల మెత్తని కాటన్ లైనింగ్ తప్పనిసరి.
 

Advertisement
Advertisement