సంక్లిష భాషాస్రష్ట | Sakshi
Sakshi News home page

సంక్లిష భాషాస్రష్ట

Published Sat, Aug 15 2015 11:15 PM

సంక్లిష భాషాస్రష్ట

‘బాహుబలి’ సినిమాలో కాలకేయుడు మాట్లాడిన సంక్లిష్ట కిలికి భాష తెలిసిందే కదా! కాలకేయుడి పాత్రను రక్తి కట్టించేందుకు ఒక రచయిత సృష్టించిన ఆ భాష జనాలకు వినోదాన్ని పంచింది. ప్రపంచంలో ఇప్పటి వరకు జనం వాడుకలో ఉన్న భాషలను ఎవరు సృష్టించారో తెలియదు గానీ, కొత్త కొత్త భాషలు సృష్టించడానికి ఇదివరకు కూడా కొందరు ప్రయత్నించారు. అదృష్టవశాత్తు అవి వాడుకలోకి రాలేదు. బ్రిటిష్ రచయిత, బహుభాషా నిపుణుడు జేఆర్‌ఆర్ టాకీన్ తన జీవితకాలంలో అలాంటి పనే చేశాడు. ‘ద హోబిట్’ రచయితగా ప్రఖ్యాతుడైన టాకీన్ ఏకంగా ఐదు సంక్లిష్ట భాషలను సృష్టించాడు. ఎల్విష్, ఎస్పరాంటో, లోజ్బాన్, క్లింగాన్, వాయ్‌నిచ్ భాషలను సృష్టించడమే కాకుండా, వాటికి వ్యాకరణ సూత్రాలను తయారు చేశాడు. ఈ భాషలను అర్థం చేసుకునే వారే కరువవడంతో, అవి అతడితోనే అంతరించిపోయాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement