లేడీస్‌ అంతగుడ్డిగా దేన్నీ నమ్మరు...

5 Aug, 2019 07:27 IST|Sakshi
ఎమ్‌. కిరణ్‌ కుమార్‌

డబ్బులు ఊరికే రావు అన్న మాటకు పేటెంట్‌ లలితా జ్యుయెలరీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎమ్‌. కిరణ్‌ కుమారే! మనకి డబ్బు ఊరికే రాదన్న విషయం గ్రహించిన వ్యక్తి .. మన కష్టాన్నే కాదు..డబ్బు విలువను కూడా గ్రహించినట్టే! విలువలు చదువుకుంటే రావు... అనుభవాలే విలువలకు పాఠాలు! వజ్రం విలువ తెలిసినవాడు మనిషి విలువను తెలుసుకుంటే ఆ మనిషే ఒక వజ్రం అవుతాడు!

తన జీవితంలోని కష్టసుఖాలను తరుగుపెట్టి సాక్షికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ...

బిజినెస్‌ చాలా ఈజీ..
ఎంత పెద్ద చదువులు చదువుకున్నా  నెల జీతం దగ్గరే ప్లాన్‌ చేసుకుంటోంది యూత్‌. ప్రతివాళ్లూ పది నుంచి అయిదు గంటల ఉద్యోగాలనే సౌకర్యంగా ఫీలవుతున్నారు. దానికే మైండ్‌ను సెట్‌ చేసుకుంటున్నారు. కూలి పనికి చదువెందుకు చెప్పండి? అందుకే యూత్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌వైపు రావాలి. రిస్క్‌ ఉంటుంది. తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రిస్క్‌ వద్దనుకుంటే ఇరవైవేల జీతానికే రాజీ పడి.. లైఫ్‌ పట్ల కంప్లయింట్స్‌ పెట్టుకోకూడదు. లైఫ్‌లో చాలెంజ్‌ ఉండాలి అనుకుంటే రిస్క్‌ తీసుకోవాలి. సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలి. లక్ష రూపాయల పెట్టుబడితో అయినా సరే వ్యాపారం స్టార్ట్‌ చేయొచ్చు. నిజానికి బిజినెస్‌ చాలా ఈజీ.

నాకు ఆరుగురు అక్కయ్యలు, ఒక్క అన్న.. మొత్తం ఎనిమిదిమందిమి. ప్రతి పూటా కడుపు నిండా భోజనం మాకు చాలెంజే! ఇంట్లో అందరికీ మంచి గుడ్డలు లేక అందరం కలిసి ఒకేసారి బయటకు వెళ్లలేకపోయేవాళ్లం. గుడ్డల దాకా ఎందుకు అందరికీ సరిపడా భోజనం కూడా ఉండేది కాదు. అది మాకు తెలియనివ్వకుండా మేనేజ్‌ చేసేది మా అమ్మ. అయినా గుర్తుపట్టి ఆకల్లేదు అంటూ ఆ బాధను దిగమింగుకునేవాళ్లం. చెప్పాలంటే ఇలాంటివి బోలెడు. అదో స్ట్రగుల్‌. నాకు ఇప్పటికీ గుర్తొస్తుంటుంది.. రోజూ రాత్రి పడుకునే ముందు అమ్మ ‘‘ ఎలాగోలా ఈ రోజు గట్టెక్కింది. రేపు ఎలా గడిచిపోయింది?’’ అని ఆలోచిస్తూనే పడుకునేది. అందుకే లేమిని ఎలా అనుభవించామో గుర్తుపెట్టుకుంటే కలిమికి బానిసలం కాము. సౌకర్యాలు మనల్ని నడిపించకూడదు. వాటి అవసరమెంతో గ్రహించే విచక్షణ మనకుండాలి అంటాను.

చదువు.. గురువులు
బడికి వెళ్లి నేను చదువుకుంది లేదు. చిన్నప్పటి నుంచి నేను ఎదుర్కొన్న పరిస్థితులే నాకు గురువులు. నేనేం సాధించినా జీవిత పాఠాల సారంతోనే. ఎంత చదువుకున్నా, ఎంత మంచిగా ఉన్నా.. ఎన్ని గొప్ప పనులు చేసినా సరే.. మన దగ్గర డబ్బులుంటేనే గుర్తింపు ఉంటుంది.

జీవిత భాగస్వామి
 నా భార్యా వాళ్లది మా కన్నా కాస్త కలిగిన కుటుంబం. అయినా కష్టం విలువ తెలిసిన మనిషి. వృథాగా ఖర్చు పెట్టదు. ఇల్లు, ముగ్గురు పిల్లలు, వాళ్ల చదువుల బాధ్యతంతా ఆమెదే. ఈ మధ్య నుంచే బిజినెస్‌లో కూడా హెల్ప్‌ చేస్తోంది. వ్యాపారానికి సంబంధించి నా గురించి అన్నీ తెలిసిన ఒక నమ్మకమైన మనిషి తోడుగా ఉండడం చాలా అవసరం. లైఫ్‌ పార్టనర్‌ను మించిన రిలయబుల్‌ ఫ్రెండ్‌ ఎవరుంటారు? ఎవరికైనా?. డైమండ్స్‌ జ్యుయెలరీ వింగ్‌ను ఆమెకు అప్పజెప్పాను. ఓ వైపు డైమండ్‌ జ్యుయెలరీ డిజైన్స్, ప్రైజ్‌ చూసుకుంటూనే నెమ్మదిగా పర్చేజ్, హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్స్‌ గురించీ తెలుసుకుని ప్రస్తుతం వాటినీ కమాండ్‌ చేస్తోంది.

భార్య హేమా కిరణ్‌కుమార్, కూతుళ్లు భక్తి కిరణ్, భవ్య కిరణ్, కొడుకు హీత్‌ కిరణ్‌లతో లలితా జ్యుయెలరీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎమ్‌. కిరణ్‌కుమార్‌
వాళ్లేం చెప్పినా మన మంచికే
నా భార్య సలహాలను తప్పకుండా పాటిస్తా. నా కన్నా ఆమెకే ముందు చూపు ఎక్కువ. ఆ మాటకొస్తే ఆడవాళ్లందరికీ ముందు చూపు ఉంటుంది. మగవాళ్ల కన్నా లోతుగా ఆలోచిస్తారు. మగవాళ్లు ఏ ఆలోచన లేకుండానే ఓ మాట అనేస్తారు. కాని ఆడవాళ్లు అలా కాదు. వాళ్లలో బ్యూటీ అదే. ఉదాహరణకు.. నా స్టాఫ్‌ ఎవరైనా వచ్చి ‘‘అన్నా .. ఒక ప్రాబ్లం వచ్చింది. నాకో లక్ష రూపాయిలు కావాలి’’ అని అడిగితే ‘‘సరే.. ఇస్తాలే’’ అనేస్తా. అదే మా ఇంట్లో పనమ్మాయి మా ఆవిడను ఒక పదివేలు అడిగిందనుకోండి. ‘‘ఏమైంది? పోయిన్నెలే తీసుకున్నావ్‌ కదా? మళ్లీ ఎందుకు అవసరమొచ్చింది? బాబుకు బాగాలేదా?’’ అంటూ మా ఆవిడ ఆమెను ఓ పది ప్రశ్నలు అడుగుతుంది. బాగాలేదు అని పనమ్మాయి జవాబిస్తే.. డ్రైవర్‌ను పురమాయిస్తుంది ‘‘వెళ్లి వాళ్ల బాబును చూసిరా’’ అంటూ. అంటే నిజంగానే ఆ పదివేలు తనకు అంత అర్జెంటా? లేక తాగుడుకో, ఇంక దేనికో భర్త సతాయిస్తే అడుగుతోందా అన్న విషయం తేల్చుకోవడానికి. సబబే అనిపిస్తే వెంటనే పదివేలు సర్దుతుంది. అంతెందుకు ‘‘నా పర్స్‌లో డబ్బులు అయిపోయాయి.. పెట్టు’’ అని నేను చెబితే కూడా ‘‘మొన్ననే 30 వేలు పెట్టాను. రెండు రోజుల్లోనే అయిపోయాయా? లెక్క చెప్పండి?’’ అంటుంది. అలా లేడీస్‌ అంతగుడ్డిగా దేన్నీ నమ్మరు. నిజానికి  అంత ఈజీగా డబ్బూ ఖర్చుపెట్టరు. కాబట్టి ఆడవాళ్లు ఏదైనా చెబుతుంటే శ్రద్ధగా వినాలి. ఆ ఆడవాళ్లు మీకేం తెలుసు? అని కొట్టిపారేయొద్దు. వాళ్లేం చెప్పినా 99 శాతం మన మంచికే. మీ మేలు కోరుకొనే ఒకే ఒక్క మనిషి భార్యే. ఒకవేళ భార్యలో మీకు లోపాలు కనిపించాయంటే అది కచ్చితంగా మీ తప్పే. మీలో నిజాయితీ, బాధ్యత లోపించిందన్నమాటే. భర్త.. భార్యను గౌరవిస్తే.. భార్యా.. భర్తను గౌరవిస్తుంది.. ప్రేమిస్తుంది.

ఫ్యామిలీ టైమ్‌
ఏ కొంచెం టైమ్‌ దొరికినా కుటుంబంతో గడుపుతా. ఇంట్లో ఉన్నా ఆలోచనలన్నీ బిజినెస్‌ చుట్టే తిరుగుతుంటాయి. మాట్లాడుతూనే మైండ్‌లో పది ప్లాన్స్‌ తయారైపోతాయి. కాని బయటకు కనపడనివ్వను . ఊర్లో ఉంటే కచ్చితంగా రాత్రి భోజనం అందరం కలిసే చేస్తాం. హోటల్స్‌లో డిన్నర్స్‌ చాలా రేర్‌. ఏ మాత్రం వీలున్నా ఫ్యామిలీతో షాపింగ్‌ కూడా చేస్తా. ఒకవేళ కుదరకపోతే మా ఆవిడ తనకు నచ్చినవన్నీ ఫొటోస్‌ తీసి నాకు వాట్సప్‌ చేస్తుంది. సెలెక్ట్‌ చేయమని. ‘‘మీకు నచ్చినవి తీసుకోండి’’ అంటే వినదు. ఎలాగైనా నన్ను ఇన్వాల్వ్‌ చేయాలని (నవ్వుతూ).

సమాజంలో స్త్రీల మీద పెరుగుతున్న దాడులు..
దేన్నయినా సహనంగా భరించే రోజులకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. ఆడవాళ్లూ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలి. తమ జోలికి వచ్చిన మగవాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. రానున్న రోజులు మరింత గడ్డుకాలంగా కనబడ్తున్నాయి కాబట్టి ధైర్యంగా ఉండాల్సిందే.

తోబుట్టువులు
ఊహ తెలిశాక ఓ మూడు నాలుగేళ్లు  ఎంజాయ్‌ చేసుంటానేమో పండుగలను! నాకు పన్నెండు, పదమూడేళ్లు వచ్చేసరికే ఇంట్లో పేదరికం  అర్థమైపోయింది. అప్పటి నుంచీ పండుగలన్నిటికీ దూరం. దృష్టంతా డబ్బు సంపాదనమీదే. కాని రాఖీ పండుగ నాకు మంచి చైల్డ్‌ మెమరీ.  మా అక్కయ్యలు రాఖీ కడితే.. ప్రతి అక్కయ్యకు రూపాయి పావలా ఇచ్చేవాడిని. అక్కయ్యలు బొట్టు పెట్టి.. రాఖీ కడుతుంటే ఆ ప్రేమ స్పర్శ నాకో భరోసానిచ్చేది. వాళ్లకు పెళ్లిళ్లై, పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు వచ్చాక ఎవరి కుటుంబాలతో వాళ్లు బిజీ అయ్యారు. అందుకే ఇప్పుడు రాఖీకి  ఆ ప్రేమ పోస్ట్‌లో వస్తూంటుంది (నవ్వుతూ) మా అక్కయ్యలకు, నాకు మధ్య చాలా ఏజ్‌ గ్యాప్‌ ఉంది. మా పెద్దక్కయ్యకు పెళ్లయి పాప పుట్టాక నేను పుట్టాను. అందుకే మా అక్కయ్యలందరిలో నేను అమ్మ ప్రేమనే ఆస్వాదించా. మా మూడో అక్కయ్యతో నాకు అటాచ్‌మెంట్‌ ఎక్కువ. ఆమే నాకున్న  రెండు జతల బట్టలను శుభ్రంగా ఉతికి.. ఇస్త్రీ చేసి పెట్టేది.   చిన్నప్పుడు నాకు జుట్టు బాగా ఒత్తుగా ఉండేది. అప్పట్లో పఫ్‌ తీసుకోవడం ప్యాషన్‌. అలా పఫ్‌ తీసి దువ్వి.. తనకు నచ్చినట్టుగా నన్ను తయారు చేసేది.  చాలా మిస్‌ అవుతాను ఆ రోజుల్ని. అప్పుడున్న ప్రేమాప్యాయతలు వేరు.

ఫ్రెండ్స్‌.. పార్టీలు..
అలాంటి వాతావరణంలో పెరగలేదు. కాబట్టి ఇప్పుడూ అవి అలవాటు కాలేదు. చాలా చాలా నార్మల్‌ లైఫ్‌. నాకు ఫ్రెండ్స్‌ కూడా పెద్దగా లేరు. పార్టీలు, గెట్‌ టుగెదర్‌లు, ఇంటికి పిలిచి భోజనాలు పెట్టడాలూ ఉండవ్‌. ఆ రోజు ఎలా బతికానో.. ఈ రోజూ అలాగే ఉన్నాను.. ఉన్నాం!

ఆడపిల్ల.. మగ పిల్లాడు అనే భేదం..
ఎందుకు ఉండాలి? తల్లిదండ్రులకు బాగా లేదంటే ఎంతమంది మగపిల్లలు పరిగెత్తుకొస్తున్నారు? అదే కూతురైతే? పెళ్లయి అత్తారింట్లో ఉన్నా భర్త, అత్తమామలకు నచ్చజెప్పుకొని తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది. కళ్లలో పెట్టుకొని చూసుకుంటుంది. ఇదంతా ప్రేమతో చేస్తుంది.. ప్రతిఫలం ఆశించకుండా! కూతురు లేని ఫ్యామిలీ కంప్లీట్‌ ఫ్యామిలీయే కాదు. నన్ను అడిగితే కూతురు చాలా ముఖ్యం.. కొడుకు సెకండ్‌ ముఖ్యం అంటాను.

రిగ్రెట్స్‌..
నేనో కొత్త బ్రాంచ్‌ ఓపెన్‌ చేసినా.. కొత్త కారు కొనుక్కున్నా మా అమ్మానాన్న గుర్తొస్తారు. వాళ్లు లేకుండా ఇదంతా ఎక్స్‌పీరియన్స్‌ అవుతున్నానే అని చాలా రిగ్రెట్స్‌ ఫీలవుతా. కష్టాలు మాత్రమే అనుభవించి పోయారు. కనీసం కడుపు నిండా తిండిక్కూడా నోచుకోలేదు. కాని ఈ రోజు నాకున్నదంతా వాళ్ల ఆశీర్వాదమే. వాళ్ల బ్లెసింగ్స్‌తోనే ఈ స్థాయికొచ్చాను. ముఖ్యంగా మా అమ్మ ఆశీర్వాదం. ఎనిమిది మంది బిడ్డలు కాదు.. వేయి మంది బిడ్డలున్నా అందరికీ సమానంగా ప్రేమను పంచడం ఆమెకే సాధ్యం. ప్రతిరోజూ మా అమ్మానాన్న (షకాలి బాయి, మూల్‌చంద్‌ జీ) ఫొటోకు దీపం పెట్టి దండం పెడ్తాను. గంటలు గంటలు పూజలు, భజనలైతే చేయను కాని మనస్ఫూర్తిగా స్మరించుకుంటాను.

సోషల్‌ మీడియా
ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వీటన్నింటికీ దూరం. అసలు నాకు వాటి గురించి తెలియను కూడా తెలియదు. నా దగ్గరున్న కంప్యూటర్‌ ఎలా ఆపరేట్‌ చేయాలో కూడా తెలియదు. మనుషులతో నేరుగా మాట్లాడ్డమే ఇష్టం.

డబ్బులు ఊరికే రావు.. బంగారానికి బ్రాండ్‌ నేమ్‌
నాకు దేవుడు నా కస్టమర్‌. వాళ్లిచ్చిన డబ్బులతోనే నా తిండి, నా బట్టలు, కారు.. ఈ వ్యాపారమైనా. అలాంటి కస్టమర్‌కు డబ్బులు ఊరికే రావు కదా! ఈ నిజం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటిదాకా దీన్నిలా ఎవరూ అడ్రస్‌ చేయలేదు. గోల్డ్‌ ఇండస్ట్రీ.. ఆ మాటకొస్తే ఏ ఇండస్ట్రీ గురించైనా సామాన్యులకేం తెలుసు? లేబుల్‌ వేసి.. ఇదే హండ్రెడ్‌ పర్సెంట్‌ క్వాలిటీ అంటే దాన్నే నమ్మి కొనుక్కుంటారు. నేను అలాంటి గిమ్మిక్కులు చేయకుండా డబ్బు కోసం పడే కష్టం విలువ తెలిసిన వాడిగా ప్రొడక్ట్‌ క్వాలిటీ పట్ల కస్టమర్‌కు అవగాహన కల్పిస్తున్నాను. అతని కష్టానికి సరితూగే క్వాలిటీ ప్రొడక్ట్‌ను చేతిలో పెడ్తున్నాను. నేనేం చెబుతానో.. అదే చేస్తాను. నా మాటలే ఈరోజు బ్రాండ్‌ నేమ్‌గా అయ్యాయి అంటే నన్ను నమ్ముతున్నట్టేగా. ఆ నమ్మకం ఎప్పటికీ వమ్ము కాదు. ఫ్యూచర్‌లో లిస్టింగ్‌కి కూడా వెళ్తాను. లలితా జ్యుయెలరీ అంటే మనందరి జ్యుయెలరీగా అనుకునేలా చేస్తాను. ఎంప్లాయ్స్‌ విషయంలో కూడా అంతే కన్‌సర్న్‌తో ఉంటాను. నా దగ్గర మొత్తం 33 వేలకు పైనే ఎంప్లాయ్స్‌ ఉన్నారు. వాళ్లందరినీ నా కుటుంబంగానే ట్రీట్‌చేస్తా. హార్డ్‌ వర్క్‌ అండ్‌ టీమ్‌ వర్క్‌తోనే విక్టరీ అని నమ్ముతా. దాన్నే పాటిస్తా. నా ఉద్యోగులకూ అదే చెప్తా.-సంభాషణ: సరస్వతి రమ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రుతురాగాల బంటీ

ఖండాంతర పరుగులు

'ఉన్నావ్‌' నువ్వు తోడుగా

హేట్సాఫ్‌ టు సాక్షి

మాట్లాడితే రూపాయి నోట్ల దండలు

చిన్న జీవితంలోని పరిపూర్ణత

ఇక్కడ అందం అమ్మబడును

లోకమంతా స్నేహమంత్ర !

స్తూపిక... జ్ఞాన సూచిక

దేవుడే సర్వం స్వాస్థ్యం

కారుణ్యం కురిసే కాలం

ఒకరిది అందం.. మరొకరిది ఆకర్షణ

శ్రావణ మాసం సకల శుభాలకు ఆవాసం...

కోడలి క్వశ్చన్స్‌..మెగాస్టార్‌ ఆన్సర్స్‌

కూరిమి తినండి

వెదురును వంటగ మలిచి...

అమెరికా గుజ్జు తీస్తున్నారు

ప్రకృతిసిద్ధంగా శరీర సౌందర్యం

ప్రకృతి హితమే రక్షగా...

పోస్టర్‌ల మహాసముద్రం

ఆమెకు అండగా ‘షీ టీమ్‌’

శుభప్రద శ్రావణం

అరచేతిలో ‘e’ జ్ఞానం

అమ్మ పాలు... ఎంతో మేలు

వరుసగా గర్భస్రావాలు.. సంతానభాగ్యం ఉందా?

యాంటీ డిసీజ్‌ ఆహారం

తండ్రి లేడు... అమ్మ టైలర్‌

పశ్చాత్తాప దీపం

ఆ కాపురంపై మీ కామెంట్‌?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆరేళ్లు పెద్దవాడు...అస్సలు చర్చించను’

బిగ్‌బాస్‌లో సెలబ్రేషన్స్‌​.. ఎలిమినేషన్స్‌​.. ఎమోషన్స్‌

వీడియో వైరల్‌..  రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు

వారం రోజులపాటు ఆశ్రమంలో

ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు

సౌత్‌ ఎంట్రీ?