రారండోయ్‌ | Sakshi
Sakshi News home page

రారండోయ్‌

Published Mon, Feb 17 2020 1:37 AM

literature Events In Telugu States - Sakshi

ఆధునిక సాహిత్యంలో రైతు సాహిత్య కార్యక్రమం ఫిబ్రవరి 22న సాయంత్రం 4:30కు విజయవాడలోని టాగూర్‌ స్మారక గ్రంథాలయంలో జరగనుంది. వక్త: జి.లక్ష్మీనరసయ్య. నిర్వహణ: నవ్యాంధ్ర రచయితల సంఘం.
పక్కి రవీంధ్రనాథ్‌ కవితా సంపుటి ‘పక్షితనాన్ని కలగంటూ’ ఆవిష్కరణ ఫిబ్రవరి 23న ఉదయం 9 గంటలకు పార్వతీపురం ఐ.టీ.డీ.ఏ. సామాజిక భవనంలో జరగనుంది. అట్టాడ అప్పల్నాయుడు, దర్భశయనం శ్రీనివాసాచార్య, గంటేడ గౌరునాయుడు, పుప్పాల శ్రీరామ్, పాయల మురళీకృష్ణ పాల్గొంటారు. నిర్వహణ: స్నేహ కళాసాహితి.
► రాజాం రచయితల వేదిక ప్రచురించిన ‘సాహితీ సౌరభాలు’ ఆవిష్కరణ, వేదిక ఐదో వార్షికోత్సవ సభ ఫిబ్రవరి 23న ఉదయం 9:30కు రాజాంలోని విద్యానికేతన్‌ పాఠశాలలో జరగనుంది. వెల్చేరు నారాయణరావు,  మండలి బుద్ధప్రసాద్, దీర్ఘాసి విజయభాస్కర్, గార రంగనాథం పాల్గొంటారు.
► కాశీం, వీవీ, సాయిబాబా ‘జైలు నిర్బంధాన్ని’ ఖండిస్తూ, ‘సీఏఏ’ను నిరసిస్తూ ఫిబ్రవరి 23న ఉదయం 10 నుంచీ రోజంతా విజయవాడలోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో విప్లవ రచయితల సంఘం సభ జరపనుంది. జి.లక్ష్మీనరసయ్య, ఎన్‌.వేణుగోపాల్, ఖాదర్‌ మొహియుద్దీన్, ప్రసాదమూర్తి, వేంపల్లి షరీఫ్, పినాకపాణి, జి.రోహిత్, అరసవల్లి కృష్ణ, బాసిత్, రివేరా ప్రసంగిస్తారు.   
► చలపాక ప్రకాష్‌ ‘ఈ కాలమ్‌ కథలు’ ఆవిష్కరణ ఫిబ్రవరి 23న ఉదయం 10:30కు గుంటూరులోని కొరటాల భవన్‌లో జరగనుంది. నిర్వహణ: గుంటూరు జిల్లా రచయితల సంఘం.
► బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌ వారి విశిష్ట సాహితీసేవా పురస్కారాన్ని డాక్టర్‌ కోడూరు ప్రభాకరరెడ్డికి ఫిబ్రవరి 23న సాయంత్రం 6:30కు గుంటూరులోని ఐ.టి.ఎ. హాల్‌లో ప్రదానం చేయనున్నారు. కడియాల రామమోహన రాయ్, గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి పాల్గొంటారు.
► యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ‘నెలనెలా సీమ సాహిత్యం’ 100వ సదస్సులో ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ‘శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద– సామాజిక జీవనం’ అంశంపై ప్రసంగిస్తారు. ముఖ్య అతిథి: నరాల రామారెడ్డి. ఫిబ్రవరి 28న 10 గంటలకు ‘జానమద్ది హనుమచ్ఛాస్త్రి స్మారకోపన్యాస సభ’ జరగనుంది. ముఖ్య అతిథి: కోడూరు ప్రభాకర రెడ్డి. వేదిక: బ్రౌన్‌ కేంద్రం, కడప.
► కొలకలూరి పురస్కారాలు–2020 ప్రదాన సభ ఫిబ్రవరి 26న సాయంత్రం హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనుంది. కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారానికి ‘బుగతలనాటి చుక్కపల్లి’(చింతకింది శ్రీనివాసరావు); కొలకలూరి భాగీరథి కథానికా పురస్కారానికి ‘వెంట వచ్చునది’(ఎమ్వీ రామిరెడ్డి) ఎంపికైనాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement