Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Thu, Nov 2 2017 1:04 AM

 love doctor slove the problems - Sakshi

హాయ్‌ సర్, మిమ్మల్ని చిన్నప్పుడు డిటెక్టివ్‌ పరమహంస అనే సీరియల్‌లో చూశాను. (‘డిడి1’లో వచ్చేది) అప్పటి నుంచి మీరంటే ఒక పాజిటివ్‌ వైబ్రేషన్‌. నేను, మా అక్క కూతురు ఒకరినొకరు ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మెయిన్‌ ప్రాబ్లమ్‌ ఏజ్‌. తనకి 19, నాకు 29. వాళ్ల ఇంట్లో వాళ్లు ‘చిన్న పిల్ల.. ఇవ్వం’ అంటారేమోనని భయం. నన్ను చేసుకోకుంటే తను ఏమైపోతుందో అని భయం. లేచిపోయే ఉద్దేశం అసలు లేదు. మరి అంత వయసు తేడా ఉంటే పెళ్లి చేసుకోవచ్చా? మీరు ఇచ్చే సమాధానం నాకు చాలా ముఖ్యం. దయచేసి సలహా ఇవ్వండి సార్‌!– రఘు
‘డిటెక్టివ్‌ పరమహింసా... సార్‌!?!’ అదే రాశాడా రఘు..!? ‘కాదా సార్‌?’ అవునా??? ‘ఏదీ.. మళ్లీ చూద్దాం.. డిటెక్టివ్‌ ప..ర..మ.. అయ్యో సార్‌ తప్పు చదివాను.. హ..ం..స! సార్‌ పరమహంస సార్‌ సారీ.. సారీ..! ఈసారీ....’ చాలు! స్టెప్సులెయ్యకు...!! నాకు తెలుసు నువ్వు కావాలనే ‘‘హింస’’ అని చదివావు..!!! ‘సార్‌ ఇప్పుడు లవ్‌ డాక్టర్‌ పెట్టేది ‘‘హింస’’ అని అప్పుడప్పుడు అంటున్నాను కానీ.. అప్పటి విషయం నాకు తెలియదు.. అప్పుడు నేను చిన్న పిల్లనో.. అసలు పుట్టానో లేదో కూడా తెలియదు సార్‌!’ అంటే నాకు ఇప్పుడు ఏజ్‌ అయిపోయింది... ఈ ఏజ్‌లో లవ్‌ డాక్టర్‌ అని యంగ్‌గా ఫీల్‌ అవడం ఏంటీ... అనేకదా నీ కామెంట్‌..!? ‘అయ్యో.. అయ్యో... అయ్యో.. అయ్యో...... సార్‌...! నేను అనాల్సినవి కూడా మీరే అనేసి నా నోట్లో పెట్టేస్తున్నారు.

చాలా అన్‌ఫెయిర్‌ సార్‌!!’ అప్పటికి నేను పుట్టలేదు అంటే ఏంటి మరి? అంటే ఇప్పుడు రఘు టెన్‌ ఇయర్స్‌ డిఫరెన్స్‌ ఉన్న అమ్మాయిని చేసుకోవడం విషయం ఎక్స్‌క్యూజ్‌గా వాడి నా ఏజ్‌ మీద ఫిటింగ్‌ పెడుతున్నావు కదా!?? ‘తప్పయింది... లెంపలేసుకుంటాను! అక్కడ రఘు వెయిటింగ్‌ సార్‌!!’ రఘూ...! బంధువుల్లో పెళ్లి నేను ఒప్పుకోను. తప్పు. పుట్టే పిల్లలు సఫర్‌ అయ్యే అవకాశం ఎంతగానో ఉంది. వయసులో తేడా ఉన్నా... ఆరోగ్యంగా ఉంటే.. పెళ్లికి వయసు అడ్డం రాదు! కానీ, వద్దు రఘూ! మేనకోడలు చాలా దగ్గర సంబంధం!! పిల్లల్లో అవిటితనం వచ్చే అవకాశం చాలా ఎక్కువ!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement
Advertisement