నన్నడగొద్దు ప్లీజ్‌  | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Published Wed, Feb 7 2018 12:21 AM

 love doctor solve the love problems - Sakshi

హాయ్‌ సార్‌..! నేను ఒక అబ్బాయిని లవ్‌ చేస్తున్నా. తనూ నన్ను లవ్‌ చేస్తున్నాను అంటున్నాడు కానీ, మళ్లీ లవ్‌ చెయ్యడంలేదు అంటున్నాడు. మరి ఫస్ట్‌ ఎందుకు లవ్‌ చేశావని అడిగితే... ‘‘నచ్చావ్, అందుకే లవ్‌ చేశాను’’ అంటున్నాడు. మరి ఇప్పుడు..? అని అడిగితే.. లవ్‌ చెయ్యడం లేదంటున్నాడు. ఒకసారి నువ్వంటే ప్రాణం అంటాడు మరోసారి అదేం లేదంటాడు. నన్ను ఫుల్‌గా కన్ఫ్యూజ్‌ చేస్తున్నాడు సార్‌. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. అసలు తనని లవ్‌ చెయ్యాలా వద్దా సార్‌? అలా అని తనని మరిచిపోలేను. ఏదైనా మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌. – రమ
థౌజెండ్‌ మందార పువ్వులు తీసుకో చెల్లెమ్మా..! ‘వెయ్యి మందార పువ్వులతో ఏం చెయ్యాలి సార్‌???’ముందు తీసుకుంటే అప్పుడు చెబుతా.. ‘చీటింగ్‌ చీటింగ్‌ సార్‌..! రేపు మీ చెల్లెలు వెయ్యి మందార పూలు కొన్నాక.. మీరు పట్టించుకోకపోతే..? కుదరదంటే కుదరదు అంతే.. ఏం చెయ్యాలో ఇప్పుడే చెప్పాలి సార్‌!’ ఓకే.. నువ్వు ఇంక నస పెట్టకు నీలాంబరీ.. అందమైన అమ్మాయిలు నస పెడితే అందం ఎగిరిపోతుంది. ‘సార్‌... నా అందం ఇంపార్టెంట్‌ కాదు సార్‌.. నేను ఇంటెలిజెంట్‌ అది ఇంపార్టెంట్‌..!!’ ఒక పువ్వు తీసుకుని... ‘ఊ.. తీసుకుని?’ దాంట్లో నుంచి ఒక రేక తుంచేయాలి. ‘ఊ.. తుంచేసి..?’ ‘‘తను నన్ను ప్రేమిస్తున్నాడు..’’ అని అనుకోవాలి. ‘ఊ.. అనుకుని...?’ మళ్లీ ఇంకో రెక్క తుంచేయాలి.

‘ఊ.. మళ్లీ తుంచేసి..?’ ‘‘తను నన్ను ప్రేమించడం లేదు..’’ అని అనుకోవాలి.‘ఊ.. అనుకుని..?’
చివరి పువ్వులోని చివరి రెక్క పీకి పారేసినప్పుడు.. ‘ఊ.. పీకి పారేసినప్పుడు..?’ ప్రేమిస్తున్నాడని అనుకుంటుందో.. ప్రేమించడంలేదని అనుకుంటుందో.. దాన్నిబట్టి అబ్బాయి రమను ప్రేమిస్తున్నాడో లేదో తెలిసిపోతుంది. ‘తొండి సార్‌.. వెయ్యి మందార పువ్వులకు గుండు కొట్టి అబ్బాయి ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి మీకు ఉత్తరం రాయాల్సిన అవసరం ఏముంది సార్‌??’ నేను చెబుతుందీ అదే. ఆ అబ్బాయి మతిస్థిమితం లేని కాండిడేట్‌. ఎప్పుడు ఎస్‌ అంటాడో.. ఎప్పుడు నో అంటాడో ఆ మెంటల్‌కే తెలీదు. అది తెలుసుకునే బదులు రమ... ‘వెయ్యి మందారపువ్వులను బాధ పెట్టినట్టు తనను తాను బాధపెట్టుకోకుండా ముందుకు సాగిపోతే మంచిదని చెబుతున్నారా సార్‌??’ యు ఆర్‌ వెరీ స్మార్ట్‌ నీలూ...! ‘మీరు కూడా సార్‌..!! ఇంద తొక్క పీకేసిన అరటిపండు’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1,  బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
Advertisement