నన్నడగొద్దు ప్లీజ్‌ | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Tue, Nov 14 2017 11:27 PM

love doctor solve the problem - Sakshi

హాయ్‌ అన్నా..! థ్యాంక్యూ ఫర్‌ గివింగ్‌ సజెషన్స్‌ ఫర్‌ ఆల్‌ అన్నా...!! అన్నా... లవ్‌ కూడా అట్రాక్షన్‌తోనే మొదలవ్వుద్ది. వన్‌ ఇయర్‌ తరువాత లవ్‌గా మారుద్ది. అదెలా అంటే ఒకరికి ఒకరిపై నమ్మకం వల్ల. అప్పుడు అర్థమవ్వుద్ది లవ్‌ అంటే నమ్మకం అని. ఒక గర్ల్‌ ఫ్రెండో లేక బాయ్‌ ఫ్రెండో కాదు.. మన పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, బ్రదర్స్, సిస్టర్స్‌ పైన చూపించేది కూడా ప్రేమే.కాకపోతే.. లవర్‌తో రిలేషన్‌లో ఉన్నప్పుడు... ఒక రకం ఫీలింగ్‌ వస్తుందంతే. నాకు ఏం ప్రాబ్లమ్‌ లేదు. ఇక నా ఫ్రెండ్స్‌కి కూడా ఏ ప్రాబ్లమ్‌ లేదు. మీకు లేఖలు రాస్తారే వాళ్లందరికీ లవ్‌కి, ఆకర్షణకి తేడా చెప్పండన్నా అంతే! అప్పుడు నిజమైన లవ్‌ చేస్తారు. ఆ లవర్స్, హజ్బెండ్స్‌ అండ్‌ వైవ్స్‌ మధ్యలో అండర్‌స్టాండింగ్‌ ఉండాలని చెప్పండన్నా ప్లీజ్‌! నేను చెప్పింది తప్పైతే మాత్రం సారీ అన్నా!?! – మోహన్‌
మోహన్‌ అన్నా...! లవ్‌ ఆన్సర్లు ఇచ్చి ఇచ్చి అలసిపోయానన్నా..! వన్‌ వీక్‌ సెలవ్‌ పెడదామనుకుంటున్నా..! కానీ నీలాంబరి ఒప్పుకోవడం లేదు...! లవ్‌ జంటలంతా ఏమవ్వాలి..? మీరు దొబ్బేస్తే... అని క్లాస్‌ పీకుతోంది అన్నా..! ఏమి చెయ్యాలో అర్థం కాక... ఆఫీసులోనే ఉంటే జుట్టు పీక్కో బుద్ధి వేస్తోంది అన్నా... అందుకే అరటి తోటలో గడ్డి పీకుతున్నా అన్నా..! ఏం చెయ్యాలో అన్న అయోమయంలో ఉన్నప్పుడు... దేవుడు పంపించినట్టు నువ్వు తగిలావు అన్నా..! నేను ఒక వారం గడ్డి పీకుతా అన్నా.. నువ్వొచ్చి నీలాంబరితో కలసి లవ్‌ డాక్టర్‌గా ఆన్సర్స్‌ పీకన్నా ప్లీజ్‌!! ‘కుదరదు సార్‌ మోహన్‌ ఎంత ఇంటెలిజెంట్‌ అయినా..’ ‘ఎంత స్మార్ట్‌ అయినా..’‘ఎంత యంగ్‌ అండ్‌ డైనమిక్‌ అయినా...’‘ఎంత సూపర్‌ అయినా...’‘నేను మీతో తప్ప ఇంకెవరితో లవ్‌ పీకనంటే.. పీకనంతే!!’ సారీ బ్రో.. నీకు చాన్స్‌ లేదు! నాకు అదృష్టం లేదు..!! ఏదో ఇలాగే లైఫ్‌ లాగించేద్దాం. ఎనీవే థాంక్యూ ఫర్‌ లవ్లీ అడ్వైజ్‌!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

తప్పక చదవండి

Advertisement