నన్నడగొద్దు ప్లీజ్ | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Published Sat, Feb 17 2018 12:47 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నేను ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నా. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. ఈ విషయం మా ఇద్దరి ఇంట్లోనూ తెలిసింది. పెళ్లి చేసుకుంటామని చెబితే... మా ఇంట్లో వాళ్లంతా ఓకే అన్నారు. కానీ, వాళ్ల ఇంట్లో వాళ్ల డాడీ ఒప్పుకోవడంలేదు. మావిద్దరివీ ఒకటే కులం, ఒకటే మతం. అయినా కూడా అతను అంగీకరించడంలేదు. తన మాట కాదంటున్నందుకు ఆ అమ్మాయిని ఆయన గట్టిగా కొట్టారు. దాంతో తన రైట్‌ లెగ్‌ ఫ్రాక్చర్‌ అయ్యింది. మేం వెళ్లి మాట్లాడదామనుకుంటే.. ‘‘మీరొస్తే మేం చచ్చిపోతాం’’ అంటున్నారు. తను బాగా ఏడుస్తోంది అన్నయ్యా.. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ప్లీజ్‌ మంచి సలహా ఇవ్వండి. – సన్ని
ప్రేమించిన వాళ్లకు ఎన్ని కష్టాలు.. ‘అవును సార్‌ అమ్మాయి అబ్బాయి ఓకే.. యూజువల్లీ అబ్బాయి పేరెంట్స్‌ తెగ పెంట చేస్తూ ఉంటారు. కానీ, ఇక్కడ అబ్బాయి పేరెంట్స్‌ కమాన్‌ లెట్స్‌ గో మ్యారీ అని రెడీ అయిపోయారు. పోనీ ప్రేమకు నేపద్యాలు అడ్డమా అంటే.. అది కూడా నో ప్రాబ్లమ్‌. కానీ అమ్మాయి ఫాదర్‌ ఏంటి సార్‌ అలా..?’ కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా ఆయనకు... ‘ఏంటి సార్‌ కోపం... ఎక్కడైనా అమ్మాయి ఫాదరో, బ్రదరో... హీరో బొక్కలు ఇరగ్గొడతారు కానీ ఈయనేంటి సార్‌ రివర్స్‌లో.. సొంత కూతురు కాళ్లు ఫ్రాక్చర్‌ చేశాడు..?’ ఇద్దరూ మేజర్స్‌ అయితే విషయం పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్లడం కరెక్ట్‌ నీలూ..!! ‘వాళ్లు చేస్తారా సార్‌ పెళ్లి?’ అది పోలీస్‌ స్టేషన్‌ నీలూ.. మ్యారేజ్‌ హాల్‌ కాదు. అమ్మాయిని కాపాడతారు, తండ్రితో మాట్లాడతారు. మంచిచెడూ చెబుతారు. లీగల్‌ పాయింట్స్‌ ఎక్స్‌ప్లెయిన్‌ చేస్తారు.
‘సార్‌ మరి మీకెందుకు సార్‌ ఉత్తరాలు రాయడం అందరు పోలీస్‌ స్టేషన్‌కి పోయి లవ్‌ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేసుకోవచ్చు కదా?’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, 
బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.lovedoctorram@sakshi.com

Advertisement
Advertisement