నన్నడగొద్దు ప్లీజ్‌

13 Mar, 2018 00:12 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్‌...! నేను ఒక అబ్బాయిని టు ఇయర్స్‌ నుంచి లవ్‌ చేస్తున్నా. తను కూడా నన్ను లవ్‌ చేశాడు. నేను తనని లవ్‌ చేశానని మా ఇంట్లో కూడా తెలుసు. కానీ తను మాత్రం... ‘‘నేను నిన్ను అసలు లవ్వే చెయ్యలేదు, నేను ఇంకో అమ్మాయిని సిన్సియర్‌గా లవ్‌ చేస్తున్నా, తననే పెళ్లి చేసుకుంటా’’ అన్నాడు. ఆ అమ్మాయి ఫోటో కూడా పంపించాడు. దాంతో మేం చాలా రోజులు మాట్లాడుకోలేదు. కానీ ఇప్పుడు మళ్లీ తనే... ‘‘నువ్వంటే చాలా ఇష్టం, నిన్నే పెళ్లి చేసుకుంటా’’ అంటున్నాడు. నాకు తన మీద నమ్మకం లేదు. బట్‌ తనంటే ప్రాణం. తను లేకుండా నేను ఉండలేను. సొల్యూషన్‌ చెప్పండి ప్లీజ్‌.
– సుమిత్ర

బతకలేనంటావేంటి రా బంగారం...? ‘చెబుతుంది కదా సార్‌ చాలా ఇష్టమని..!?’ వాడు తెడ్డుగాడు... ‘ఏంటి సార్‌ మీ చెల్లెలు ఇష్టపడ్డ వాణ్ని పట్టుకుని తెడ్డుగాడంటున్నారు????’ సరే వాడు కేటుగాడు...! ‘సార్‌ ఫీల్‌ అవుద్ది సార్‌ సుమిత్ర..!’అవ్వాలి.. కనబడిన అమ్మాయినల్లా ట్రాప్‌ చేసే కొడుకు... ‘సార్‌... వెరీ బ్యాడ్‌ సార్‌....!’ ఓకే సారీ సుమిత్ర... వాడు వేస్ట్‌గాడు రా బంగారం. వాడు నిన్ను ముంచేస్తాడు. అస్సలు నమ్మకు. కొత్త దుపట్టాలతో పాత గొంతులు కోసే రకం... ‘కొత్త దుపట్టాలతో పాత గొంతులు.. అంటే ఏంటి సార్‌???’ కొత్తగా కనపడిన అమ్మాయి దుపట్టాతో... పాత లవర్‌ గొంతు కోసే యూజ్‌లెస్‌ ఫెలో అని.‘అర్థమయ్యింది కదా సుమిత్ర..! మీ అన్నయ్యకు వాడి మీద చాలా కోపంగా ఉంది. నేను ఎంత ఆపినా ముక్కులోనుంచి చెవుల్లోనుంచి పొగలు కక్కుతూనే ఉన్నారు. ఆయన మాట విని వాణ్ని మరచిపో బంగారం!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే  ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.  లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా