నన్నడగొద్దు ప్లీజ్‌ | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Wed, Oct 25 2017 12:53 AM

love doctor solve the problems

హాయ్‌ అన్నయ్యా! నా లైఫ్‌కి మీరే సొల్యూషన్‌ చెప్పాలి. నేను మ్యారీడ్‌. ఇప్పుడు నాకు ఒక బాబు. తను పెళ్లికి ముందు చాలా మంచివాడిలా ఉంటూ.. మా అమ్మని, నన్ను బాగా నమ్మించాడు. వాళ్ల ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అయితే వాళ్లంతా నన్ను చాలా అవమానించి టార్చర్‌ చేసేవాళ్లు. నా భర్త కోసం అన్నీ భరించాను. కానీ ఇప్పుడు తను కూడా అలానే టార్చర్‌ చేస్తున్నాడు. నేనొద్దని, వాళ్ల ఫ్యామిలీనే కావాలని నన్ను, బాబుని వదిలేసి వెళ్లిపోయాడు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. అంతా పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వమంటున్నారు. అలా చేస్తే... నా లైఫ్‌ సెటిల్‌ అవ్వదు. ప్లీజ్‌ మీరే ఒక సలహా ఇవ్వండి. – రమ
వద్దన్నా ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాడు! నేనున్నాను చూసుకుంటాను అని నీకు భరోసా ఇచ్చాడు! వాళ్ల పేరెంట్స్‌ ఇబ్బంది పెట్టినా అడ్డు పడలేదు! ఇప్పుడు తోక ముడిచి పారిపోయాడు! కొన్ని రోజుల్లో ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేస్తాడు! ఆ తరువాత ఇంకొకరిని.. అలా ఇంకొకరిని... ‘సార్‌ అడ్వైజ్‌ ఇవ్వండి సార్‌.. పాపం రమ!!’ పాపమా! గీపమా!! నా చెల్లెలికి ఏంటి తక్కువ..? ‘వాడెళ్లిపోయాడు కదా సార్‌.. చిన్న పిల్లాడిని ఇచ్చి...!’ అయితే తలకాయ దించుకుని.. కన్నీళ్లు కారుస్తూ... సమాజానికి భయపడి... బిక్కుబిక్కుమంటూ బతకాలా నా బంగారం?

‘సార్‌ నేను అలా అనలేదు సార్‌.. కానీ ఎలా సార్‌ బతకడం?’ ఇప్పుడే బతకడమేంటో చూపించాలి..! స్ట్రాంగ్‌గా దమ్మున్న నా చెల్లెలుగా.. తన కొడుకును తండ్రిలా కాకుండా చూసుకోవాలి! ‘సార్‌ మీ ఎమోషన్‌ ఆపి... ట్వంటీ ఇయర్స్‌ ప్యూచర్‌ స్టోరీ కాకుండా... ఇప్పుడేం చెయ్యాలో చెప్పండి సార్‌!’ వెంటనే పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వాలి. వాడికి కౌన్సెలింగ్‌ చేయించాలి! వాళ్ల పేరెంట్స్‌కి కూడా కౌన్సెలింగ్‌ చేయించాలి! ధైర్యంగా అన్యాయాన్ని ఎదిరించాలి!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.lovedoctorram@sakshi.com

Advertisement

తప్పక చదవండి

Advertisement