నన్నడగొద్దు ప్లీజ్‌ | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Tue, Nov 7 2017 12:20 AM

 love doctor solve the problems - Sakshi

హాయ్‌ సర్‌.. నేను డైలీ లవ్‌ డాక్టర్‌ చూస్తాను. నాకూ ఓ సలహా ఇవ్వండి సార్‌ ప్లీజ్‌!  నేను, ఒక అమ్మాయి టూ ఇయర్స్‌ నుంచి ప్రేమించుకుంటున్నాం. మా ఇద్దరి ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పాం. మా ఇంట్లో ఓకే అన్నారు కానీ వాళ్ల ఇంట్లో వాళ్ల అమ్మ నేపథ్యాలు వేరని ఆలోచిస్తున్నారు. అయితే ఈ మధ్య తను నన్ను అవాయిడ్‌ చేస్తోంది. ఎందుకు అని అడిగితే.. ‘కుదరట్లేదు’ అంటోంది. దాంతో డైలీ గొడవ పడుతున్నాం. నిజంగానే తనకు కుదరకపోతే నేనే అలా ఫీల్‌ అవుతున్నానో తెలియడంలేదు. తను లేకపోతే నేను బతకలేను సార్‌. మా మధ్య అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏదేమైనా తను నా లైఫ్‌ పార్టనర్‌గా కావాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలో మంచి సలహా ఇవ్వండి సార్‌ ప్లీజ్‌! – వేణు
కావాలి అంటే?‘ఏముంది సార్‌ ఇంత కూడా అర్థం కావడంలేదు!?’కావాలి ఏంటి?‘ప్రేమిస్తే అలాగే అనిపిస్తుంది సార్‌!’చాలా తెలుసు నీకు?‘నాకు తెలిసి ఏం లాభం సార్‌!?’అంటే..?‘ఏముందిలే సార్‌ చెవిటోడి ముందు సెల్‌ ఫోన్‌ మోగించి ఏం లాభం?’సెల్‌ ఫోనా..? శంఖం కాదా??‘ఏ రాౖయెతే ఏముంది సార్‌ గుండె పగలకొట్టుకోవడానికి?’తల పగలకొట్టుకోవడానికి కాదా?‘మనం ఏది పగలగొట్టుకున్నా ఏముందిలే సార్‌.. వేణు విషయం చూడండి!!’కావాలనడానికి పాపం ఆ అమ్మాయేమయినా బొమ్మా వేణూ..?తప్పు.. నిన్ను ఇష్టపడింది. ఇంట్లో కష్టపెట్టారు. అమ్మను గౌరవించి ఆగింది. నువ్వు కూడా ఒక మంచి ప్రేమికుడిగా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తావని నమ్మింది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకు వేణు. బీ గుడ్‌. బి పేషెన్ట్‌.మీరు కెరియర్స్‌లో సెటిల్‌ అయ్యాకా.. అన్ని కుదుట పడతాయి! ఏమంటావు నీలూ..?‘అబ్బాయిని తిట్టకుండా సలహా ఇచ్చారు.. హోప్‌ హీ విల్‌ బీ స్ట్రాంగ్‌ సార్‌!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ,సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్,  హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
Advertisement