చరితార్థుడు | Sakshi
Sakshi News home page

చరితార్థుడు

Published Wed, Sep 2 2015 2:11 AM

చరితార్థుడు - Sakshi

గొప్ప నాయకుల లక్షణాల గురించి కొందరు మహానుభావులు చెప్పిన మాటలను మననం చేసుకుందాం. వారు చెప్పిన ఉత్తమ నాయకత్వ లక్షణాలు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలో ఉన్నాయి. ఈ సందర్భంగా వారి మాటలను మననం చేసుకుందాం.
 
 ‘వెయ్యిమైళ్ల ప్రయాణం కూడా తొలి అడుగుతోనే మొదలవుతుంది.’
 - లావో జి, చైనీస్ తత్వవేత్త, కవి
 .......................................................
 ‘లోకాన్ని కదిలించాలనుకుంటే, ముందు మనం కదలాలి.’
 - సోక్రటీస్, గ్రీకు తత్వవేత్త
 .......................................................
 ‘మనం సరైన పనులు చేయడానికి కారణం మనకు సుగుణాలు ఉండటం కాదు, మనం సరైన పనులు చేయడం వల్లనే మనం సుగుణవంతులం అవుతాం.’
 - అరిస్టాటిల్, గ్రీకు తత్వవేత్త
 .......................................................
 ‘పుట్టుకతోనే ఎవరూ గొప్పవాళ్లు కాలేరు... తమ చేతలతోనే గొప్పవాళ్లవుతారు.’
 - చాణక్యుడు, అర్థశాస్త్ర రచయిత
 .......................................................
 ‘మరణించిన తర్వాత జనం మరచిపోకుండా ఉండాలంటే, చదవదగ్గది ఏదైనా రాయాలి. లేకుంటే, కనీసం రాయదగ్గ పనులు చేయాలి.’
 - బెంజమిన్ ఫ్రాంక్లిన్, రాజనీతిజ్ఞుడు
 .......................................................
 ‘ప్రజల మనోభీష్టమే సమస్తం... ప్రజల మనోభీష్టం అనుకూలంగా ఉంటే ఏదీ విఫలం చెందదు. అది లేకుండా ఏదీ విజయవంతం కాలేదు.’
 - అబ్రహాం లింకన్, అమెరికా 16వ అధ్యక్షుడు
 .......................................................
 ‘నా జీవితమే నా సందేశం.’
 - మహాత్మా గాంధీ, భారత జాతిపిత
 .......................................................
 ‘బాధ్యతే గొప్పతనానికి మూల్యం.’
 - విన్‌స్టన్ చర్చిల్, బ్రిటన్ మాజీ ప్రధాని
 .......................................................
 ‘ఇతరుల కోసం జీవించిన జీవితమే ధన్యం.’
 - అల్బర్ట్ ఐన్‌స్టీన్, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త
 .......................................................
 ‘మన ఆదర్శాలను, లక్ష్యాలను, నియమాలను మరచినప్పుడే అపజయం ఎదురవుతుంది’
 - జవహర్‌లాల్ నెహ్రూ, భారత తొలి ప్రధాని
 .......................................................
 ‘దేశం నీకేమిచ్చిందనేది కాదు, నీవు దేశానికి ఏం చేశావనేదే ముఖ్యం.’
 - జాన్ ఎఫ్ కెన్నడీ,
 అమెరికా 35వ అధ్యక్షుడు
 .......................................................
 ‘మనిషి మంచితనం ఒక జ్వాల. అది దాగి ఉండొచ్చేమో గానీ, ఎప్పటికీ అది ఆరిపోదు.’
 - నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు
 ‘నన్ను విమర్శించండి. మరేం ఫర్వాలేదు. చరిత్ర నన్ను నిరపరాధిగా గుర్తిస్తుంది.’
 - ఫిడెల్ క్యాస్ట్రో, క్యూబా మాజీ అధ్యక్షుడు
 .......................................................
 ‘సాధించిన విజయాలకు సంబరాలు చేసుకుంటూ కాదు, పరాజయాలను అధిగమిస్తూ జీవించాలి.’
 - చే గువేరా, లాటిన్ అమెరికన్ విప్లవ వీరుడు
 .......................................................
 ‘మంచి పని చేయడానికి కాలం ఎప్పుడూ మంచిదే.’
 - మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్,
 అమెరికన్ నల్లజాతి హక్కుల నాయకుడు
 .......................................................
 ‘మంచితనమే నా మతం.’
 - దలైలామా, టిబెటన్ల మత గురువు
 ‘మనం వచ్చే శతాబ్దిలోకి సాగుతున్నాం... ఈ పరిస్థితుల్లో ఇతరులకు సాధికారిత కల్పించగల వాళ్లే నాయకులు కాగలరు.’
 - బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు
 .......................................................
 ‘మీరు సరైన దారిలోనే సాగుతూ ఉంటే, మీకు ముందుకు సాగాలనే సంకల్పం ఉంటే, తప్పకుండా మీరు అభివృద్ధి సాధిస్తారు.
 - బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు
 .......................................................
 ‘ఇప్పుడే మన భవిష్యత్తును నిర్మించుకుందాం. మన కలలను రేపటి వాస్తవంగా మలచుకుందాం.’
 - మలాలా యూసఫ్‌జాయ్, నోబెల్ గ్రహీత
 
Advertisement
Advertisement