మేకప్‌తో మెరుగులు | Sakshi
Sakshi News home page

మేకప్‌తో మెరుగులు

Published Thu, May 30 2019 2:10 AM

Makeup is a  dark color for lips - Sakshi

వస్త్రధారణకు తగ్గట్టు మేకప్‌ ఉంటేనే అందంగా కనిపిస్తారు. అయితే, మేకప్‌ ఎలా ఉండాలంటే...

►సమకాలీన పరిస్థితులను అనుసరిస్తూ ఫ్యాషన్‌లోనూ, మేకప్‌లోనూ ట్రెండ్స్‌ను పరిశీలిస్తూ మేనికి నప్పే సౌందర్య ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలి.

►మేకప్‌లో ఫౌండేషన్‌ను ఎక్కువ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జిడ్డు చర్మానికి ఫౌండేషన్‌ మరింతగా అతుక్కుపోయి, సహజకాంతిని దూరం చేస్తుంది.

►పెదవులకు ముదురు రంగు లిప్‌స్టిక్‌లను వాడితే వయసు పైబడినట్టుగా చూపిస్తాయి. అసహజంగానూ కనిపిస్తాయి. తప్పనిసరై ముదురు రంగు లిప్‌స్టిక్‌ వాడితే, పైన లిప్‌గ్లాస్‌ సహజసిద్ధమైనది ఎంచుకోవాలి.

►మేకప్‌ అంటే పెదవులకు గాఢమైన ముదురు రంగు, కనురెప్పలకు మెరుపులద్దే షిమ్మర్‌ని ఉపయోగించాలనుకోకూడదు. ముఖంలో పెదవులు, కళ్లు, బుగ్గలు.. ఇలా ప్రతి భాగాన్ని అత్యంత జాగ్రత్తగా చిత్రకారుడు బొమ్మను గీసినంత అందంగా తీర్చిదిద్దాలి.

►ఎప్పుడైనా ముఖం సహజమైన మెరుపుతో కనిపించాలి. ఇందుకోసం అత్యంత తక్కువ మేకప్‌ను ఎంచుకోవాలి.

Advertisement
Advertisement