ఘోస్ట్ టూరిజం! | Sakshi
Sakshi News home page

ఘోస్ట్ టూరిజం!

Published Tue, Jun 30 2015 11:44 PM

ఘోస్ట్ టూరిజం!

నయాట్రెండ్
‘ఘోస్ట్ టూరిజం’ అనే మాట వినడానికి విచిత్రంగా ఉండొచ్చుగానీ... ఆస్ట్రేలియాలో మాత్రం ఈ టూరిజానికి మాంచి డిమాండ్ ఉందట. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా సిటీలో ఉన్న మాంట్ క్రిస్టో భవంతికి ‘మోస్ట్ హంటెడ్ హౌజ్’గా పేరుంది. యాభై సంవత్సరాల ఆలివ్ రెయాన్ తన కొడుకుతో పాటు మాంట్ క్రిస్టో భవంతిలో నివాసముండేది. ఈ భవంతికి అసలు యజమానులైన క్రిస్టోఫర్, ఎలిజెబెత్ దంపతుల ఆత్మలు ఆమెను ఎన్నోసార్లు వేధించాయట. ‘దెయ్యాల కొంప’ అని తన నివాసానికి ఉన్న పేరును ఊరకే పోనిస్తే ఏంలాభం? అనుకుందో ఏమిటో... ఆలివ్ రెయాన్ ఇప్పుడు ఆ భవనాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేసింది. ఇక అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దెయ్యాలు, ఆత్మల మీద ఆసక్తి ఉన్నవాళ్లు ఈ భవనాన్ని చూడడానికి, అందులో బస చేయడానికి క్యూ కడుతున్నారట.
 
‘ఆ భవనంలో ఒక రాత్రి’ అని కొందరు రచయితలు హాటు హాటుగా రాసే ప్రయత్నంలో ఉన్నారట. మాంట్ క్రిస్టో దెయ్యాల భవంతికి వస్తున్న ఆదరణ చూసి చిన్నా చితకా హంటెడ్ హౌజ్‌లు ఇప్పుడు పర్యాటక స్థలాలుగా వర్థిల్లుతున్నాయి. కొందరు యజమానులైతే ‘మాది అభూతకల్పనల భవంతి కాదు...అసలు సిసలైన దెయ్యాల భవంతి’లాంటి విచిత్రమైన ప్రకటనలు కూడా ఇస్తున్నారు!

Advertisement

తప్పక చదవండి

Advertisement