యాంగ్జైటీని నిమ్మళింపజేస్తుంది! | Sakshi
Sakshi News home page

యాంగ్జైటీని నిమ్మళింపజేస్తుంది!

Published Mon, Feb 15 2016 10:38 PM

యాంగ్జైటీని నిమ్మళింపజేస్తుంది!

తిండి  గోల
నిమ్మలో ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు ఎక్కువ. ఈ ఎండార్ఫిన్‌లో యాంగ్జైటీ తగ్గించే గుణం ఉంటుంది. మనం బాగా వ్యాయామం చేసిన తర్వాత ఒక సంతోషకరమైన భావన ఉంటుంది. అది ఈ ఎండార్ఫిన్ స్రావాల వల్లనే. ఇది ఎక్కువగా లభ్యం కావాలంటే నిమ్మ జాతి పండ్లు బాగా తోడ్పడతాయి. మందులతో కాకుండా నిమ్మ స్వాభావికంగానే యాంగ్జైటీనీ నిమ్మళింపజేస్తుందన్నమాట. పైగా సంతోషకరమైన భావనను పెంపొందిస్తుంది.

అందుకే నిమ్మను ఎక్కువగా వాడటం వల్ల రోగనిరోధకశక్తిని పెంపొందించే విటమిన్-సి సమకూరడమే కాకుండా, సంతోషమూ కలుగుతుంది. నిమ్మలోనే గాక... నిమ్మజాతి పండ్లయిన నారింజ, బత్తాయిలలోనూ ఇదే గుణం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement