గోళ్లు ఆరోగ్యం | Sakshi
Sakshi News home page

గోళ్లు ఆరోగ్యం

Published Thu, Sep 24 2015 11:23 PM

గోళ్లు  ఆరోగ్యం

 బ్యూటిప్స్

ఏదైనా ఫంక్షన్‌కు అటెండ్ అవ్వాలంటే అమ్మాయిలు ముఖసౌందర్యానికే కాదు చేతిగోళ్లకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఏ రంగు డ్రెస్ వేసుకుంటే ఆ రంగు నెయిల్ పాలిష్ వేసుకోవడం నడుస్తున్న ప్రస్తుత ట్రెండ్. అలా రోజుకు గోళ్లకు రంగు వేసేటప్పుడు ఒక్కసారి వాటిని గమనించండి. వాటి ఆకారంలో ఏదైనా తేడా కొడుతుందా అని. ఎందుకంటే మీ గోళ్లను చూసి మీ ఆరోగ్య సమస్యలను పసిగట్టొచ్చన్న విషయాన్ని గుర్తించండి.. ఇదిగో ఇవే ఆ గుర్తులు..

 పసుపు పచ్చగా మారితే
గోళ్లు పసుపు రంగులో ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అది యెల్లో నెయిల్ సిండ్రోమ్ అయ్యుండొచ్చు. దాని వల్ల రంగు మారడమే కాకుండా మందంగా, పెరుగుదల లేకుండా ఉంటాయి. అది మధుమేహం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే.

ఎరుపు గీతలు
ఇది చాలా ప్రమాదకరమైనది. గోళ్ల కింద ఎరుపు లేక బ్రౌన్ గీతలు వస్తుంటే గుండె సంబంధిత వ్యాధి (హార్ట్ వాల్వ్ ఇన్‌ఫెక్షన్) మీకు  ఉండే అవకాశం ఉందని తెలుసుకోండి. అంతేకాకుండా అలా ఉంటే క్లబ్బింగ్ నెయిల్స్ అనే వ్యాధి కూడా అయ్యుండొచ్చు. దాని వల్ల గీతలే కాదు గోరు చిగురు వెడల్పు అవడం, గోరు పైకి ఉబ్బినట్టు కనిపిస్తుంది.

  తెల్ల మచ్చలు
 సాధారణంగా చాలా మందికి ఈ తెల్ల మచ్చల సమస్య ఉంటుంది. ఇవి ఒకటి లేక రెండు గోళ్లపై కనిపిస్తాయి. టెక్నికల్‌గా దీన్ని లికొనేషియా అంటారు. ఇది కాల్షియం లోపం కారణంగా వస్తుంది. దీనికి రోజూ పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే నెయిల్ పాలిష్ పడక కూడా చాలామందికి ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు.
 

 

Advertisement
Advertisement