రెండోసారి కాదందట?

15 Aug, 2015 23:53 IST|Sakshi
రెండోసారి కాదందట?

ప్రస్తుతం నయనతార ఫుల్ బిజీ. ఆమె చేతిలో నాలుగైదు తమిళ సినిమాలున్నాయి. మరి కొన్ని అవకాశాలు కూడా వరిస్తున్నాయట. కథాకథనాలు బాగుంటే చాలు...ఎంత చిన్నహీరో సరసన నటించడానికి సై అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ ‘మాయ’ అనే చిత్రం. ఇందులో ఓ నూతన హీరో సరసన ఆమె నటిస్తున్నారు. ఈ చిత్ర దర్శకునికి ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే..ప్రస్తుతం నయనతారకు వచ్చిన అవకాశాల్లో విక్రమ్ సినిమా ఒకటి. ఇందులో నయనతారను కథానాయికగా తీసుకోవాలనుకున్నారట. కానీ దర్శక, నిర్మాతలు అడిగితే నయనతార తిరస్కరించడం చర్చనీయాంశమైంది.  ఎందుకంటే గతంలో విక్రమ్ సరసన ఓ సినిమాకు అవకాశం వస్తే నయనతార గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. మళ్లీ విక్రమ్ సినిమా ఆఫర్‌ను  ఆమె తిరస్కరించడంతో ఈ హీరోగారి సరసన నటించడం ఇష్టం లేకే ఇలా చేస్తున్నారా..లేక డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కాదంటున్నారా అని కోలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. మరి అసలు రీజన్ ఏంటో నయనతారకే తెలియాలి!

మరిన్ని వార్తలు