షర్ట్ మార్చేద్దాం.. | Sakshi
Sakshi News home page

షర్ట్ మార్చేద్దాం..

Published Thu, Nov 3 2016 11:16 PM

షర్ట్ మార్చేద్దాం..

న్యూలుక్

షర్ట్, టీ షర్ట్స్ అమ్మాయిల జాబితాలో ఎప్పుడో చేరిపోయాయి. ఎప్పుడూ వాటిని ఒకే మోడల్‌లో ధరిస్తే బోర్. వాటికే కొత్త హంగులు అద్దితే... చిన్న మార్పుతో ఫ్యాషన్‌లో ముందు వరసలో ఉండచ్చు. ఇందుకు చేయవలసిందల్లా...

నచ్చిన టీ షర్ట్‌ని ఎంచుకోవాలి. మెడ భాగం, సైడ్స్ భాగం ఫొటోలో చూపిన విధంగా కట్ చేయాలి. కాంట్రాస్ట్ రిబ్బన్‌ని జత చేయాలి. ఒక కొత్త టాప్ రెడీ.

షర్ట్ రూపం కొత్తగా మార్చేయాలంటే.. కాలర్ కింది భాగం అంటే ఛాతీ భాగం కత్తిరించి దీనికి లేస్ ఫ్యాబ్రిక్‌ని జత చేయాలి. షర్ట్‌తో చేసిన టాప్ ట్రెండీగా కనిపిస్తుంది.

వైట్ కలర్ కాలర్ ఉన్న చొక్కాను తీసుకోవాలి. కాలర్ భాగాన్ని ఉంచి, కేవలం ఛాతీ పై భాగాన్ని మాత్రమే కట్ చేయాలి. లేస్ ఫ్యాబ్రిక్‌ని జత చేయాలి. అలాగే చేతులను షార్ట్ స్లీవ్స్ వచ్చేలా కట్ చేసి సన్నగా కుట్టాలి. ఇలా డిజైన్ చేసుకున్న న్యూ షర్ట్ టాప్... జీన్స్ మీదకు స్టైలిష్‌గా కనిపిస్తుంది.

పొడవాటి చేతుల చొక్కా లేదా టీ షర్ట్‌ని ఎంచుకోవాలి. చొక్కాకున్న కాలర్ పార్ట్, హ్యాండ్స్, బాటమ్ పార్ట్స్‌ని కత్తిరించాలి. దీనికి అదే రంగు జార్జెట్ మెటీరియల్ లేదా లేస్‌ను జత చేసి కుట్టాలి. ఓ కొత్త రకం టాప్ క్యాజువల్ వేర్‌గా రెడీ అయిపోతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement