నవంబర్ 18 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | Sakshi
Sakshi News home page

నవంబర్ 18 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Published Tue, Nov 17 2015 10:41 PM

నవంబర్  18 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
నయనతార(నటి)

 
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యసంఖ్య కావడం వల్ల్ల వీరికి జన్మతః నాయకత్వ లక్షణాలుంటాయి. ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ యోగం ఉంది. బదిలీ కోసం ఎదురు చూసేవారి కల నెరవేరుతుంది. కొత్తవ్యాపారాలు ప్రారంభించడానికి, ఉన్న వ్యాపారాలు విస్తరించడానికి అనుకూలం. ఈ రోజు పుట్టిన తేదీ 18. ఇది కుజసంఖ్య కాబట్టి జన్మతః దేహదారుఢ్యం కలిగి ఉండి, పోలీసు, మిలిటరీ రంగాలలో ఉద్యోగాలు సంపాదించగలుగుతారు.

పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. పరిశ్రమలు స్థాపించాలనే కోరిక తీరుతుంది. భూమికి సంబంధించిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గత సంవత్సరం ప్రారంభించిన వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన ఆయుధాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త అవసరం. లక్కీ డేస్: 1,3,5,6,8, 9; లక్కీ కలర్స్: ఎల్లో, పర్పుల్, వైట్, క్రీమ్, రోజ్, ఆరంజ్, రెడ్; లక్కీడేస్: ఆది, మంగళ, శుక్రవారాలు. సూచనలు: మాట లలోనూ, చేతలలోనూ సంయమనం పాటించడం, దుర్గాదేవికి పూజ చేయించడం, మతగ్రంథాలను పఠించడం, వికలాంగులను ఆదరించడం, రక్తదానం చేయడం, ఆదిత్యహృదయం పఠించడం లేదా వినడం, అనాథలకు, వృద్ధులకు సాయం చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement