పెన్సిల్ మేకర్... | Sakshi
Sakshi News home page

పెన్సిల్ మేకర్...

Published Tue, Nov 25 2014 11:28 PM

పెన్సిల్  మేకర్...

ఆఫీసు అన్నాక కాగితాల వాడకం తప్పదు... వాడిన తరువాత ఆ కాగితాలను చెత్తబుట్టలోకి చేర్చకా తప్పదు. అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరముంటే కాగితాలను అలా చెత్తబుట్టలోకి చేర్చే అవసరముండకపోవచ్చు. ఎందుకంటే... ఈ పరికరం వాడేసిన కాగితాలను కాస్తా అందమైన పెన్సిళ్లమాదిరిగా మార్చేస్తుంది మరి!. పెన్సిల్‌లోని గ్రాఫైట్ ముందుగానే ఆ పరికరంలో ఏర్పాటు చేసి ఉంటారు. కాగితాన్ని పైన అందిస్తే సరి... గాలిచొరబడని రీతిలో చక్కగా గ్రాఫైట్ చుట్టూ చుట్టేస్తుంది. ఒకవైపున మనం వాడుకునేందుకు వీలుగా పెన్సిల్‌ను షార్పెన్ చేసి ఇచ్చేస్తుంది.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement