Sakshi News home page

పూరి జగన్నాథ్ డెరైక్టర్స్ హంట్

Published Thu, Jan 1 2015 10:38 PM

పూరి జగన్నాథ్ డెరైక్టర్స్ హంట్

స్టోరీ: పూరి    డెరైక్షన్: మీరే!!
 
నేటి నుంచి వరుసగా 10 రోజుల పాటుమీకు రోజుకో కథ చెబుతా. దానికి మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్‌తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు.  వాళ్లతోనే షూట్ చేయండి.
 
10 మినిట్స్...
 
ఈ పది రోజుల్లో... నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో మీరు ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి. మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే!
 
ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే నా బేనర్లో నేనే డెరైక్షన్ ఛాన్స్ ఇస్తానేమో!
 
అయితే కొన్ని కండిషన్స్...  చాలా తక్కువ ఖర్చుతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు   ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్లను డబ్బుల కోసం వేధించకూడదు. అసలు మీ సొంత డబ్బు వాడకూడదు. ఎవరో ఒకర్ని కన్విన్స్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసమే ఒకరిని కన్విన్స్ చేయలేనివాళ్లు జీవితంలో డెరైక్టర్ కాలేరు. రేపు సినిమా తీయడానికి ఏ నిర్మాతను ఒప్పించగలరు? అర్థమైందిగా..   లాస్ట్ అండ్ ఫైనల్... మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలంటే, అది మీ జీవితాన్ని మార్చేసేలా ఉండాలి.
 
గమనిక: నా జీవితం కూడా ఇలా షార్ట్ ఫిల్మ్‌లతోనే మొదలైంది.  మీ అందరికీ ఆల్ ది బెస్ట్. - పూరి జగన్నాథ్
 
 

Advertisement
Advertisement