లేచింది పురుషలోకం...దద్దరిల్లలేదు మహిళా ప్రపంచం! | Sakshi
Sakshi News home page

లేచింది పురుషలోకం...దద్దరిల్లలేదు మహిళా ప్రపంచం!

Published Tue, Jul 29 2014 11:05 PM

లేచింది పురుషలోకం...దద్దరిల్లలేదు మహిళా ప్రపంచం!

చరిత్రలో...
 
స్త్రీ వాదులు చీటికి మాటికి ‘ఇది పితృస్వామ్యవ్యవస్థ’ అని కళ్లెర్ర చేస్తారుగానీ, మేఘాలయలోని ఖాసి తెగ వారిలో మాత్రం ‘మాతృస్వామ్య వ్యవస్థ’ ఇప్పటికీ పదిలంగానే ఉంది. పిల్లలు తల్లి పేరును ఇంటిపేరుగా పెట్టుకుంటారు. పెళ్లి తరువాత అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది... ఇలా ఎన్నో ఉన్నాయి.
 
పై పాట ఇక్కడ వర్కవుట్ కాకపోవచ్చుగానీ, మేఘాలయ వెళ్లి పాడితే మాత్రం కాస్తో కూస్తో ఉపయోగం ఉంటుంది.
 
స్త్రీ వాదులు చీటికి మాటికి ‘ఇది పితృస్వామ్యవ్యవస్థ’ అని కళ్లెర్ర చేస్తారుగానీ, మేఘాలయలోని ఖాసి తెగ వారిలో మాత్రం ‘మాతృస్వామ్య వ్యవస్థ’ ఇప్పటికీ పదిలంగానే ఉంది. పిల్లలు తల్లి పేరును ఇంటిపేరుగా పెట్టుకుంటారు. పెళ్లి తరువాత అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది...ఇలా ఎన్నో ఉన్నాయి.
 
‘‘ప్రపంచం మొత్తం మగవాడి మాట చెల్లుబాటు అవుతుంటే మనమేమిటి? ఎక్కడ ఉన్నాం?’’ అన్నాడో ఖాసి తెగ పెద్దమనిషి.
 
భార్య చేతిలో తాను ఎన్ని అవమానాలకు గురి అవుతున్నాడో పూస గుచ్చినట్లు చెబుతూ ఒకడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే మిత్రుడిలో ఇంత విషాదం ఉందా? అని కరిగి కన్నీరైపోయాడు పక్కవాడు.
 
మరొకడు తన అత్త చేసే పెద్దపెద్ద దౌర్జన్యాల గురించి, చాలా చిన్న గొంతుతో చెప్పాడు. ప్రతి ఖాసి మగాడు ఏదో ఒక సమస్య చెబుతూనే ఉన్నాడు. ఇలా అయితే కుదరదనుకొని ఉద్యమం చేయాలనుకున్నారు. దానికి ‘పురుషుల విముక్తి ఉద్యమం’ అని పేరు కూడా పెట్టుకున్నారు.
 
ఏప్రిల్ నెల ఎండల్లో 1990వ సంవత్సరంలో ఖాసి తెగ పురుష లోకం తమ హక్కుల కోసం లేచింది. ఎండలతో సమానంగా వేడివేడిగా నినాదాలు ఇచ్చింది. అయితే వీరి ఉద్యమం చూసి ఏ ఒక్క మహిళా దద్దరిల్లలేదు. పై పెచ్చు కొందరు ఉద్యమకారులను మహిళలు చావబాదారు కూడా! నిజానికి కోసి తెగలో ఇలాంటి ఉద్యమాలు కొత్తేమీ కాదు. 1960లో కూడా ‘పురుష విముక్తి ఉద్యమం’ ఒకటి ఉవ్వెత్తున లేచింది.
 
అప్పట్లో విషయం మరీ సీరియస్. మహిళలు ఏకంగా కత్తులతోనే దాడి చేశారు. కొందరు చనిపోయారు కూడా. రకరకాల కారణాల వల్ల ఖాసి పురుషుల విముక్తి ఉద్యమం ఇప్పుడు వెనక్కి తగ్గింది.
 

Advertisement
Advertisement