Sakshi News home page

ఔను పొడవే!

Published Mon, Feb 18 2019 2:29 AM

Sahitya Maramaralu On Sathavadhani Gadepalli Veeraraghava Sastri - Sakshi

వీర శతావధానిగా పేరుగాంచిన గాడేపల్లి వీరరాఘవశాస్త్రి (1891–1945) విధివశాత్తూ ప్రథమ కళత్రం గతించగా, ద్వితీయ వివాహం కోసం ప్రయత్నించే సందర్భంలో చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతానికి వెళ్లారు. ఈయన ఆజానుబాహువు, గంభీరమైన విగ్రహం. వధువు పేరు సావిత్రమ్మ. పిడతల లక్ష్మీనృసింహశాస్త్రి కుమార్తె. వధువు ఇంటిలోనే పెండ్లి చూపులు, మాటలు జరిగే సందర్భంలో ‘చాలా పొడవుగా ఉన్నాడే!’ అని వధువో లేక వధువు వైపువారో అనుకోవడం శాస్త్రి చెవినపడింది. వెంటనే వారు–

పొడవనిన నిజమె, విద్యకు 
పొడవే, కీర్తికిని పొడవె, బుద్ధికి పొడవే
పొడవే విత్తమునకు, నిక
తొడవులకును పొడవె, మానుదువొ, పూనుదువో!
– అని చెప్పి చక్కా వచ్చేశారట.
పొడవైన వీరి కవితామూర్తి సావిత్రమ్మకు నచ్చినట్టుంది. వారే అర్ధాంగిౖయె వీరి కవితా వ్యవసాయానికి సాయం చేశారు. పూర్వం కవులు ఎంత కవితాత్మకంగా జీవించేవారో ఈ ఐతిహ్యం తెలియజేస్తుంది.
-డి.వి.ఎం.సత్యనారాయణ

Advertisement

తప్పక చదవండి

Advertisement