దీపారాధన తెలుసా? | Sakshi
Sakshi News home page

దీపారాధన తెలుసా?

Published Tue, May 5 2015 11:55 PM

దీపారాధన తెలుసా?

సెల్ఫ్ చెక్
 
మనం దీపారాధన చేస్తుంటాము. అయితే ఏదో ఒక నూనెతో, ఎలా పడితే అలా దీపం వెలిగించడం సరికాదు. అదేవిధంగా మనం తరచు ఉపయోగించే కొన్ని పదాలకు ఆ పేర్లెందుకు వచ్చాయో చాలామందికి తెలియదు. వాటిని తెలుసుకోవడం అవసరం.
 
1.    గణపతికి కొబ్బరినూనెతో చేసే దీపారాధన ఫలప్రదం
     ఎ. అవును     బి.కాదు

2.    లక్ష్మీదేవికి చేసే దీపారాధనకు ఆవునెయ్యి మంచిది
     ఎ. అవును     బి.కాదు
 
3.    దీపారాధనకు పనికిరానిది వేరుశనగ, రిఫైండాయిల్
     ఎ. అవును     బి.కాదు
 
4. నిత్య దీపారాధనకు నువ్వుల నూనె శ్రేష్ఠం
     ఎ. అవును     బి.కాదు
 
5.    తాంబూలంలో పెట్టవలసిన వక్కలు ఒకటి లేదా మూడు
     ఎ.అవును     బి. కాదు
 
6.    ముత్తైవ అంటే 5 అలంకారాలతో ఉండునది అని అర్థం.
     ఆ అయిదు పసుపు, కుంకుమ, మట్టెలు, గాజులు, తాళి
     ఎ. అవును     బి.కాదు

పైవాటిలో‘బి’లు ఎక్కువ వస్తే మీరు లౌకిక వ్యవహారాలే కాదు, మన ఆచార సంప్రదాయాలపట్ల కూడా అవగాహన పెంచుకోవాలని అర్థం.
 

Advertisement
Advertisement