మీరు కష్టాన్ని నమ్మే వ్యక్తులేనా.? | Sakshi
Sakshi News home page

మీరు కష్టాన్ని నమ్మే వ్యక్తులేనా.?

Published Sat, May 9 2015 3:13 AM

మీరు కష్టాన్ని  నమ్మే వ్యక్తులేనా.?

సెల్ఫ్ చెక్
 
కొందరికి పని సులభంగా చేయాలని ఉంటుంది. అదృష్టం కలిసి వస్తేనే ఇలాంటి వారు అందలం ఎక్కగలరు... మరికొందరు కష్టపడి పనిచేస్తారు. ఆ తర్వాతే ఫలితం ఆశిస్తారు. ఇలాంటి వారికి అదృష్టం కలిసిరాకపోయినా ఫలితం దక్కుతుంది. మీరు ఏ కోవకు చెందేవారో చెక్ చేసుకోండి.

1.     మీరు ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు. తర్వాత ఫలితం ఆశిస్తారు.
     ఎ. అవును     బి. కాదు
 
2.    మీలోని అపారమైన సంకల్పబలం మీ కష్టపడే తత్వం వల్లనే వచ్చింది.
     ఎ. అవును     బి. కాదు
 
3.    మీ పని నాణ్యతను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉంటారు.
     ఎ. అవును     బి. కాదు
 
4.    ఎంత కష్టమైనా అనుకున్న పని సాధించాలని తపన పడతారు.
     ఎ. అవును     బి. కాదు
 
5. ఇతరుల నుంచి మాట పడే పరిస్థితిని ఎన్నటికీ రానివ్వరు.
     ఎ. అవును     బి. కాదు
 
పై వాటిల్లో మూడింటికి అవును అన్నది మీ సమాధానమైతే మీరు అదృష్టం కంటే మీ కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి అని అర్థం.
 
 

Advertisement
Advertisement