గ్రేట్‌ మామ్స్‌ | Sakshi
Sakshi News home page

గ్రేట్‌ మామ్స్‌

Published Sat, Feb 25 2017 12:05 AM

గ్రేట్‌ మామ్స్‌

కానర్‌ కాక్స్‌ (18) పెన్సిల్వేనియా కాలేజ్‌లో చదువుతున్నాడు. క్లాసు రూములో ఉండగా కొరియర్‌లో అతడికి ఇంటి నుంచి రెండు ప్యాకెట్‌లు వచ్చాయి. ఒక ప్యాకెట్‌లో ఫుడ్‌ ఉంది. ‘వేళకు తిని, చక్కగా చదువుకో’ అని స్లిప్‌ ఉంది ఆ ప్యాకెట్‌లో. రెండో ప్యాకెట్‌ తెరిచాడు. అందుతో చెత్త ఉంది! వెంటనే వాళ్ల మమ్మీకి ఫోన్‌ చేశాడు. ‘సెలవులకు వచ్చినప్పుడు నువ్వు పడేయకుండా వెళ్లిన చెత్త ఇది. అక్కడే ఎక్కడైనా ట్రాష్‌ బిన్‌లో వెయ్‌’ అని చెప్పింది ఆమె! బాధ్యతను ఎంత బాగా గుర్తుచేసింది ఆ తల్లి! గ్రేట్‌.

సెయింట్‌ జార్జి (యు.ఎస్‌.)లోని ఓ స్కూల్‌లో ‘డాడ్స్‌ అండ్‌ డోనట్స్‌’ బ్రేక్‌ఫాస్ట్‌ ఈవెంట్‌ జరుగుతోంది. ఆ ఈవెంట్‌కి పిల్లలు, వాళ్ల తండ్రులు మాత్రమే వెళ్లాలి. ఆ స్కూల్లో చదువుతున్న ఓ పిల్లాడికి తండ్రి లేడు. ఇంటికొచ్చి ఈవెంట్‌ గురించి తల్లికి చెప్పాడు. ‘సరే, డాడీతోనే వెళ్దువులే’ అంది. మర్నాడు ఉదయాన్నే ఆమె ‘డాడీ’లా తయారైంది. ప్యాంట్, షర్ట్‌ వేసుకుంది. పెట్టుడు మీసాలు పెట్టుంది. కొడుకును వెంట పెట్టుకుని బ్రేక్‌ఫాస్ట్‌ ఈవెంట్‌కి వెళ్లింది. కొడుకు సంతోషించాడు. అంతకన్నా ఎక్కువగా స్కూల్‌ స్టాఫ్‌! వాళ్ల కళ్లల్లో దాదాపుగా నీళ్లు తిరిగాయట ఆ తల్లిని చూసి. ఆమె పేరు విట్‌నీ కిట్రెల్‌. గ్రేట్‌ మామ్‌ అంటూ ఇప్పుడు ఆమె మీద ప్రపంచమంతటా ప్రసంశల జల్లు కురుస్తోంది.

Advertisement
Advertisement