కూర్చుని గడిపేస్తే చక్కెర చిక్కు | Sakshi
Sakshi News home page

కూర్చుని గడిపేస్తే చక్కెర చిక్కు

Published Fri, Feb 5 2016 11:25 PM

కూర్చుని గడిపేస్తే చక్కెర చిక్కు

పరిపరి   శోధన
 

గంటలకు గంటలు కూర్చున్న చోట నుంచి లేవకుండా గడిపేస్తూ ఉంటే ఒంట్లోకి చక్కెర జబ్బు చేరడానికి ఎంతోకాలం పట్టదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూర్చుని గంటల కొద్దీ గడిపేసే వారు ఆ తర్వాత కఠిన వ్యాయామాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదని వారు చెబుతున్నారు.

మెలకువగా ఉన్న స్థితిలో తొమ్మిది గంటలు లేదా అంత కంటే ఎక్కువ సమయం కూర్చున్న స్థితిలోనే గడిపేసే వారికి టైప్-2 డయాబెటిస్ ముప్పు తప్పదని మాస్‌ట్రిక్ట్ యూనివర్సిటీకి చెందిన వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో 2,500 మంది నడి వయస్కులపై నిర్వహించిన విస్తృత అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైందని వారు చెబుతున్నారు.
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement