సిక్స్ హిడెన్ ట్రిక్స్... | Sakshi
Sakshi News home page

సిక్స్ హిడెన్ ట్రిక్స్...

Published Mon, Sep 21 2015 1:22 AM

సిక్స్ హిడెన్ ట్రిక్స్... - Sakshi

ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి ఓల్డేజ్ పీపుల్ వరకు అందరి చేతుల్లో ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. అందులో వాట్స్ యాప్ ఉండనే ఉంటుంది. అందరూ సులువుగా ఈ యాప్‌ను ఉపయోగించుకుంటున్నారు.. కానీ చాలామంది యూజర్లకుతెలియని ఆరు విషయాలు...
 
మెసేజ్ చూసిన టైమ్..
అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రెండు బ్లూ టిక్స్ కనిపిస్తే అవతలి వారు మనం పంపిన మెసేజ్‌ను చూసినట్టు లెక్క. కానీ వారు ఏ సమయానికి చూశారో తెలుసుకోవాలంటే పంపిన మెసేజ్‌ని లాంగ్ ప్రెస్ చేసి ‘జీ’ ఐకాన్‌ను ప్రెస్ చేస్తే ఏ టైమ్‌కు మెసేజ్ చూశారో తెలిసిపోతుంది.
 
ఆర్చీవ్ చాట్స్..
ఇది మీ సంభాషణను హైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తితో కానీ గ్రూప్‌తో కానీ చాట్ చేసిన సంభాషణను దాచాలంటే ఎవరిదైతే హైడ్ చేయాలనుకుంటున్నారో వారి అకౌంట్‌ను లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ ఆర్చివ్ చాట్ ఉంటుంది. గ్రూప్ మొత్తం అయితే చాట్ సెట్టింగ్స్‌కు వెళ్లి ఆర్చివ్ ఆల్ చాట్స్ అని ప్రెస్ చేయండి. అంతే! ఇక మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. దీనివల్ల మీ చాటింగ్ కన్వర్సేషన్ డిలీట్ అవ్వదు.
 
మ్యూట్ గ్రూప్ చాట్స్..
గ్రూప్ చాట్స్‌లో ఎవరో ఎవరితోనో చాట్ చేసినా మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. అలాంటప్పుడు ఏ గ్రూప్ నోటిఫికేషన్లు ఇబ్బంది పెడుతున్నాయో ఆ గ్రూప్ ఓపెన్ చేసి మెనూలోకి వెళ్లి  మ్యూట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే అక్కడ ఎంత టైమ్ వరకు నోటిఫికేషన్లు మ్యూట్‌లో పెట్టాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు.
 
లాస్ట్ సీన్‌ై టెమ్ హైడ్..
ఈ యాప్‌లో ఎవరు ఏ టైమ్‌కు ఆఖరిగా వాట్స్‌యాప్ చూశారో తెలుస్తుంది. కానీ మీ లాస్ట్ సీన్ టైమ్ ఎవరికీ తెలియకూడదనుకుంటే సెట్టింగ్స్/అకౌంట్/ప్రైవసీ లోకి వెళ్లి లాస్ట్ సీన్ దగ్గరకు వెళ్లి నోబడీ అని సెలెక్ట్ చేసుకుంటే చాలు. అలా చేస్తే వేరే వారి లాస్ట్ సీన్ మీకు కనిపించదు.
 
హోం స్క్రీన్‌పై షార్ట్‌కట్..
తరచూ మీరు ఒకే వ్యక్తితోనే ఎక్కువగా చాట్ చేస్తున్నారనుకోండి. వారు పంపిన మెసేజ్‌ను క్షణం ఆలస్యం కాకుండా చూడాలనుకుంటే షార్ట్‌కట్‌ను వాడుకోండి. ఎవరి అకౌంట్‌ను అలా చేయాలనుకుంటే వారి చాట్ మెనూలోకి లేదా గ్రూప్ పై లాంగ్ ప్రెస్‌చేసి యాడ్ చాట్ షార్ట్‌కట్ అని సెలెక్ట్ చేసుకోండి. అంతే! వారి అకౌంట్ మీ ఫోన్ స్క్రీన్‌పైకి వచ్చేస్తుంది.
 
నెట్ డేటా సేవింగ్..
ఎక్కడెక్కడి ఫొటోలు, ఆడియోలు, వీడియోలు డౌన్‌లోడ్ అవుతూ, మీ డేటా స్వాహా కాకుండా ఉండాలంటే సెట్టింగ్స్/చాట్ సెట్టింగ్స్ /మీడియా ఆటో-డౌన్‌లోడ్‌లోకి వెళ్లి అక్కడ మొబైల్ డేటా, వైఫై, రోమింగ్... ఇలా మీకు ఎప్పుడు ఆటోడౌన్‌లోడ్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిద్వారా డేటా సేవ్ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement