చదువులోనూ.. నిదానమే ప్రధానం | Sakshi
Sakshi News home page

చదువులోనూ.. నిదానమే ప్రధానం

Published Tue, Jan 26 2016 1:08 PM

చదువులోనూ.. నిదానమే ప్రధానం - Sakshi

పరిపరి   శోధన

లారీలు, బస్సులు వంటి భారీ మోటారు వాహనాల వెనుక తరచుగా ‘నిదానమే ప్రధానం’ అనే హెచ్చరిక రాసి ఉంటుంది. అంటే... అదుపు
చేయగలిగిన వేగంలో మాత్రమే వాహనాలను నడపడం క్షేమం. అయితే, ఇదే సూత్రం చదువు విషయంలోనూ వర్తిస్తుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుంఖాను పుంఖాలుగా పుస్తకాలను శరవేగంగా చదివేసి, స్వల్పకాలంలోనే మేధావులు కావడం సాధ్యం కాదని వారు అంటున్నారు.

కొన్ని సంస్థలు అందిస్తున్న స్పీడ్ రీడింగ్ ట్రైనింగ్ కోర్సుల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, వేగంగా చదివే వారికి విషయం అర్థం కాకపోగా, చదివినదేదీ గుర్తుండదని కూడా చెబుతున్నారు. దశాబ్దాల తరబడి ఈ అంశంపై పరిశోధనలు జరిపిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చామని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
 

 

Advertisement
Advertisement